Sunday, 08 September 2024 06:47:32 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

వాట్సప్​ అలెర్ట్.. +84, +62, +60 ఈ నెంబర్ల నుంచి కాల్ వస్తే ఎత్తొద్దు.

Date : 10 May 2023 05:37 PM Views : 181

జై భీమ్ టీవీ - జాతియం / : వాట్సాప్ కాల్ వస్తుంది. ఆ వెంటనే కట్ అవుతుంది. వారం రోజులుగా వాట్సాప్ యాజర్లు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఇది. +84, +62, +60 ఇంకా మరిన్ని అంతర్జాతీయ నంబర్‌ల నుండి తెలియని కాల్స్ వస్తుండటంతో చాలా మంది అందోళనకు గురవుతున్నారు. ఇవన్నీ ఇథియోపియా, మలేషియా, ఇండోనేషియా, కెన్యా, వియత్నాం దేశాలకు చెందిన కోడ్స్. ఈ కోడ్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేస్తే ఏమౌతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాట్సాప్ కాల్ నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ మోసాలకు ఇదోక ఎత్తుగడ అని అంటున్నారు. తెలియని కాలర్ మీ డేటా లేదా డబ్బును దొంగిలించడానికి ఏదైనా మాల్వేర్‌ని ఇంజెక్ట్ చేయవచ్చని చెబుతున్నారు. మీకు ఇలాంటి ఫోన్ కాల్ వస్తే ముందుగా వాటికి ఆన్సర్ చేయొద్దని, ఆయా లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయోద్దని అంటున్నారు. ఆ కాల్ కట్‌ అయ్యాక రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు. అయితే‌‌ ఈ కోడ్ కాల్స్ పై వాట్సాప్ స్పందించింది. వాట్సాప్ యూజర్లను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక టెక్నాలజీపై స్థిరమైన పెట్టుబడి పెట్టామని పేర్కొంది. గుర్తుతెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే లిప్ట్ చెయోద్దని తెలిపింది. మన భారతీయుల నెంబర్లు వారికి ఎలా చేరాయని అందరూ అనుమాన పడుతున్నారు. కొన్ని నెలల కిందట ఫేస్ బుక్ ఖాతాల నుంచి లెక్కలేనన్ని ఫోన్ నంబర్లు స్కామర్లకు అందాయి. అదే టైమ్ లో ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ పై కూడా హ్యాకింగ్ జరిగి, లక్షలాది భారతీయుల నంబర్లు బయటకొచ్చాయి. ఈ డేటా మొత్తాన్ని కొంతమంది కొన్ని అంతర్జాతీయ ఏజెన్సీలకు అమ్మేశారని తెలుస్తోంది. అలా చాలామంది వ్యక్తుల వ్యక్తిగత మొబైల్ నంబర్లు, ఇప్పుడు అంతర్జాతీయ ఏజెన్సీల చేతికి చేరాయి. వాటి నుంచి స్పామర్లు, ఆన్ లైన్ మోసాలకు పాల్పడేవారికి ఈ నంబర్లు వెళ్లాయని సమాచారం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :