Sunday, 08 September 2024 06:54:26 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్‌ పోస్టులకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష తేదీలు ఇవే..

Date : 17 November 2023 12:08 AM Views : 114

జై భీమ్ టీవీ - జాతియం / : దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల తేదీలను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ విడుదల చేసింది. నవంబర్‌ 25, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. కాగా ఈ నోటిఫికేషన్‌ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్‌) ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయా పోస్టులను ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే.. 2023-24 విద్యాసంవత్సరానికి గానూ వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును విద్యాశాఖ పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజును న‌వంబ‌రు 17వ తేదీ నుంచి డిసెంబరు 2 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగ సంచాలకుడు కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. సీపీగెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి తెలంగాణలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీపీగెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన సీట్ల వివరాలను న‌వంబ‌రు 15న విడుదల చేశారు. చివరి విడతలో 11,325 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిల్లో 6,491 మంది విద్యార్ధులకు సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన వారు న‌వంబ‌రు 18వ తేదీలోపు సంబంధిత కాలేజీలో రిపోర్టు చేయాలని కన్వీనర్‌ పాండురంగారెడ్డి తెలిపారు. Screwdriver: హోటల్‌లో భార్య దారుణ హత్య.. 41 సార్లు కిరాతకంగా స్క్రూ డ్రైవర్‌తోపొడిచిన భర్త మరో రెండు రోజుల్లో ముగియనున్న అంబేద్కర్‌ దూరవిద్య పరీక్షల ఫీజు గడువు మాచవరంలోని డాక్టర్‌ బీఆర్‌ ఆంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రం 2017కి ముందు చేరిన విద్యార్థులు పరీక్షల ఫీజు నవంబరు 18వ తేదీలోపు చెల్లించాలని డిప్యూటీ డైరెక్టర్‌ ఎం అజంతకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రూ.500ల అపరాధ రుసుంతో నవంబరు 23వ తేదీలోపు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్‌ 9 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ద్వితీయ సంవత్సర పరీక్షలు డిసెంబర్‌ 16 నుంచి 21వ తేదీ వరకు, అలాగే తృతీయ సంవత్సర పరీక్షలు డిసెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. పరీక్ష ఫీజును విద్యార్ధులు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని సూచించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :