Thursday, 25 July 2024 05:01:46 AM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

బిర్యానీ కొనేందుకు రూ.350 ఇవ్వలేదనీ పైశాచికం.. శవాన్ని రోడ్లపై ఈడుస్తూ నృత్యం!

Date : 24 November 2023 08:41 AM Views : 157

జై భీమ్ టీవీ - జాతియం / : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యాని కొనేందుకు డబ్బులు ఇవ్వలేదనీ 18 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపి, ఆ తర్వాత మృతదేహం ముందు నిందితుడు డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ విజువల్స్‌ బయటికి రావడంతో కలకలం రేగింది. మద్యం మత్తులో ఉన్న ఓ మైనర్ బాలుడు బిర్యానీ తినేందుకు డబ్బులు ఇవ్వలేదనీ బాధితుడిని దారుణంగా హత్య చేశాడు. కత్తితో శరీరంపై ఏకంగా 55 సార్లు పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్తూ.. నృత్యం చేస్తూ పైశాచికంగా ప్రవర్తించాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో రూ.350 కోసం నిందితుడు దారుణ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన దృశ్యాల్లో 16 యేళ్ల వయసున్న మైనర్‌ బాలుడు మద్యం మత్తులో బాధితుడిని మొదట గొంతు కోసి, ఆ తర్వాత 55 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. శవాన్ని వీధుల్లో ఈడ్చుకెళ్తూ నృత్యం చేశాడు. ఒకానోక సందర్భంలో శవం మీద నిలబడి కూడా డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. అయితే వీరిద్దరికీ ఒకరికొకరు పరిచయం ఉన్నట్లు కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన బాలుడు బాధిత యువకుడి నుంచి డబ్బు దోచుకోవడానికే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధిత యువకుడు ప్రతిఘటించడంతో.. నిందితుడు అతనిపై దాడి చేశాడు. మృతుడు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి.. అతని మెడపై పదేపదే కత్తితో పొడిచాడు. కాలితో తలను తన్నాడు. మృతదేహంపై నిలబడి నృత్యం చేయడం ప్రారంభించాడు. అనంతరం మృతుడి జేబులో నుంచి డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ భయంకర హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మంగళవారం రాత్రి 11.15 గంటలకు ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. బిర్యానీ కొనేందుకు డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య ) జాయ్ టిర్కీ తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు. పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :