Sunday, 08 September 2024 06:39:41 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు.. ఆ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. కానీ.!

Date : 09 October 2023 02:05 PM Views : 120

జై భీమ్ టీవీ - జాతియం / : సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికే ఏటా 2సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనుంది. 2024 నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. ఇకపై 10th, 12th బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని.. ఈ ఆప్షన్‌ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని స్పష్టం చేసింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది.. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్‌ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయన్నారు కేంద్రమంత్రి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు అన్నారు. పూర్తిస్థాయిలో ప్రిపేరై పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్‌ సాధిస్తారన్నారు మంత్రి..2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ స్పీచ్ ఈ ట్వీట్‌లో.. డమ్మీ స్కూల్స్‌పై చర్యలు.. రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్ధుల్లో అత్యధిక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అలాగే ఈ రాష్ట్రంలోనే ఎక్కువమంది మహిళా విద్యార్ధులు వేధింపులకు గురయ్యారని కేంద్రమంత్రి చెప్పారు. అటు డమ్మీ స్కూల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు ధర్మేంద్ర ప్రధాన్. స్కూల్స్‌కు హాజరు కాకపోవడం విద్యార్ధుల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందన్న మంత్రి.. వారు ఒంటరితనంతో బాధపడుతూ.. ఒత్తిడులకు గురవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారని గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ఎప్పటికప్పుడు సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(సీఏబీఈ) నుంచి సలహాలు తీసుకుని.. దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను ఆధునీకరించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :