Sunday, 08 September 2024 06:53:38 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

అబ్బా ఏమన్నా స్కెచ్చా.. పైకి చూస్తే ఫ్రూటీ డబ్బాలు, తెరిచి చూస్తే.. కళ్లు జిగేల్‌

Date : 21 November 2023 09:27 AM Views : 134

జై భీమ్ టీవీ - జాతియం / : అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ముఖ్యంగా బంగారం విలువ రోజురోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో దానినే అక్రమార్కులు తమ అక్రమార్జనకు వనరుగా మార్చుకుంటున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని దేశంలోకి తీసుకొస్తున్నారు. కస్టమ్స్‌ అధికారులు ఎన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నా రకరకాల మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. శానిటరీ ప్యాడ్స్‌ మొదలు, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల వరకు అన్ని మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ప్రతీ రోజూ దేశంలో ఏదో ఒక ఎయిర్‌ పోర్ట్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు బ్యాంకాంక్‌ నుంచి ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ అయ్యాడు. సదరు వ్యక్తి బ్యాగులో కొన్ని ఫ్రూటీ లాంటి డబ్బాలు ఉన్నాయి. ఏదో తేడా కొట్టిందో లేదా ముందస్తు సమాచారం ఆధారంగానో కస్టమ్స్‌ అధికారులు సదరు ఫ్రూటీ బాటిల్స్‌ను పరీక్షించి చూశారు. బరువు ఎక్కువ ఉండడంతో డబ్బాలను ఓపెన్‌ చేసి చూశారు. దీంఓ అందులో బ్లాక్‌ కలర్‌లో ఉన్న చిన్న బాక్సులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని కట్ చేసి చూడగా గోల్డ్‌ బిస్కెట్స్‌ ఉన్నాయి. సుమారు 4 కిలోల బరువున్న గోల్డ్‌ను గుర్తించారు. దీని విలువ అక్షరాల రూ. 2.24 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్‌ యాక్ట్‌ 1962 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ కస్టమ్స్‌ అధికారులు దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. కస్టమ్స్ అధికారులు చేసిన ట్వీట్.. మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :