Saturday, 27 July 2024 01:06:05 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

13 రోజులుగా టన్నెల్లోనే కార్మికులు.. మిషన్‌లో సాంకేతిక లోపం.. పనులకు మరోసారి ఆటంకం

Date : 24 November 2023 08:39 AM Views : 148

జై భీమ్ టీవీ - జాతియం / : ఉత్తరకాశీ టన్నెల్‌ రెస్క్యూ పనులు మళ్లీ ఆగిపోయాయి. ఈసారి ఐరన్‌ మెష్‌ వల్ల డ్రిల్లింగ్‌ మెషీన్‌ పాడుకావడంతో రెస్క్యూ ఆపేశారు అధికారులు. దీంతో నిన్ననే బయటకు వస్తారనుకున్న ఆ 41మంది మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును టన్నెల్‌లో ఉన్నవారిని రక్షించే ప్రయత్నాలు మళ్లీ ఆగిపోయాయి. దాదాపు రెండు వారాలవుతున్నా.. కార్మికులంతా టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. గురువారం సాయంత్రానికి అందర్నీ రక్షిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే అది కుదరలేదు. నవంబర్‌ 12న ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యారా దగ్గర సొరంగ మార్గం పనుల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది. టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడడంతో.. 41మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ఓ వైపు సొంరంగం తవ్వాల్సి ఉండగా.. మరోవైపు సొరంగం పూడుకు పోయింది. దీంతో గుహలోనే కార్మికులంతా చిక్కుకుపోయారు. 13 రోజులుగా అందులోనే ఉండిపోయారు. అప్పటి నుంచి వారిని రక్షించేపనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ రెండ్రోజుల క్రితం టన్నెల్ లో చిక్కుకున్నవారిని వెలుపలికి తీసుకొచ్చే ప్లాన్స్‌ను పక్కాగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. దాదాపు వారికి దగ్గరగా వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌.. ఆ సొరంగంలోనే.. మరో చిన్న సొరంగాన్ని తవ్వి కార్మికులు ఒక్కొక్కర్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే చిన్న సొరంగాన్ని డ్రిల్‌ చేస్తున్న సమయంలో.. మిషనరీ ఓ ఇనుమ మెష్‌లోకి దూసుకెళ్లింది. నిజానికి ఈ ఐరన్‌ లాటిస్‌ గిర్డర్‌ని డ్రిల్లింగ్‌ మెషీన్ల ద్వారా తీయాలని చూస్తే.. పెను ప్రమాదం తప్పదు. ఇప్పుడు రక్షించే పనులకు తోడు.. మరింత ప్రమాదంలోకి కార్మికులను నెట్టే అవకాశాలుండడంతో.. అక్కడితో రెస్క్యూ పనులను ఆపేశారు. నిజానికి గురువారం సాయంత్రమే వారిని బటయకు తీయాల్సి ఉంది కాని.. ఈ ఐరన్‌ గిర్డర్‌ అడ్డురావడంతో.. రెండు మీటర్లలోతు వరకే తవ్వగలిగారు. ఆతర్వాత డ్రిల్లింగ్‌ మెషీన్‌ ఐరన్‌ గిర్డర్‌లోకి వెళ్లి ఆగిపోయింది. దీన్ని తిరిగి బాగుచేయాలంటే ఒకరోజు పడుతుందని టన్నెలింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఈ ఇనుప మెష్‌ను కేవలం వెల్డింగ్‌ ద్వారానే బయటకు తీయగలుగుతారు కాని.. ఇలా డ్రిల్లింగ్‌తో సాధ్యం కాదని ఎన్డీఆర్‌ఎఫ్‌ ప్రకటించింది. దీంతో కార్మికులను బయటకు తీసుకొద్దామనుకున్న పనులకు మరోసారి ఆటంకం కలిగింది. మరోవైపు ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి టన్నెల్‌ దగ్గరే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన గురువారం రాత్రి కూడా టన్నెల్‌ దగ్గరే మకాం వేశారు. పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఎప్పటికపుడు టన్నెల్‌లోని కార్మికులతో వాకీటాకీల సాయంతో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్నారు. సిల్క్‌యారా టన్నెల్‌ దగ్గర తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా.. అటు రాష్ట్ర దైనందిన పాలనా కార్యక్రమాలకూ ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు. ప్రతీఏటా ఇదేరోజు ఏగాస్‌ పండుగను రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటారు కాని.. ఈసారి వద్దని సీఎం ధామి ప్రజలను అభ్యర్ధించారు. దానికి బదులుగా పండుగను మౌనంగా.. కార్మికులు బయటకు రావాలన్న ప్రార్ధనలతో జరుపుకోవాలన్నారు ధామి. కార్మికులను రక్షించేందుకు ఈ రెండు వారాల్లో 47 మీటర్ల దూరం తవ్వారు అధికారులు. ఇంకా పదిమీటర్ల మేర తవ్వాల్సిఉంది. ఈనేపథ్యంలో పనులకు మరోసారి ఆటంకం కలుగడం.. ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చిన్న సొరంగం ద్వారా కార్మికులకు మంచినీరు.. ఆహారాన్ని పంపుతున్నారు. ఈరోజు ఆ 22 టన్నుల భారీ డ్రిల్లింగ్‌ యంత్రం బాగైతే.. తిరిగి పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :