Sunday, 08 September 2024 06:59:19 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఉన్నత విద్యారంగంలో మార్పులు తెచ్చేందుకు కేంద్రం సిద్ధం.. త్వరలో పార్లమెంట్‌ ముందుకు HECI బిల్లు

Date : 12 October 2023 02:48 PM Views : 96

జై భీమ్ టీవీ - జాతియం / : ఉన్నత విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో ఉన్నత విద్యను ఒక తాటి కిందకు తెచ్చి ఏకైక నియంత్రణా సంస్థ పరిధిలో ఉంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా HECI బిల్లును పార్లమెంట్‌ ముందుకు తెస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. మెడికల్‌, లా కాలేజీలు మినహా దేశంలోని అన్ని కళాశాలలు ఈ రెగ్యులేటర్‌ పరిధిలో ఉంటాయని తెలిపారు. నియంత్రణ, అక్రిడిటేషన్‌, వృత్తిపరమైన ప్రమాణాలు నెలకొల్పడం అనే మూడు ప్రధాన పాత్రలను ఈ HECI పోషించనుంది. జాతీయ విద్యా విధానంలో HECI ఏర్పాటును ప్రతిపాదించడం జరిగింది. ఇది ఆచరణలోకి వస్తే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు రద్దవుతాయి. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ HECI లో ఛైర్మన్‌ సహ 14 మంది సభ్యులు ఉంటారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :