Sunday, 08 September 2024 06:52:50 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మళ్లీ రాళ్ల దాడి.. పగిలిన కిటికీ అద్దాలు.. 25 రోజుల్లో 4 ప్రమాదాలు

Date : 13 October 2023 12:54 PM Views : 145

జై భీమ్ టీవీ - జాతియం / : వందేభారత్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనలు తరచూ వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్‌లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని భిల్వారాలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఇక్కడ మరోసారి వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరగడంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ రైలులోని ప్రయాణికులెవరూ గాయపడలేదు. రైలుపై రాళ్లు రువ్విన దుండగుల కోసం జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. రాజస్థాన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమై నెల కూడా కాలేదు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి వంటి సంఘటనలు ఒక దాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. వందే భారత్ రైలు ఉదయపూర్ నుండి బయలుదేరి జైపూర్ చేరుకుని.. అది మళ్లీ ఉదయ్‌పూర్‌కు బయలుదేరింది. ఆ సమయంలో భిల్వారాలోని రాయలా స్టేషన్ సమీపంలో అరాచకవాదులు రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడితో రైలులో కూర్చున్న ప్రయాణీకుల మధ్య గందరగోళం ఏర్పడింది. ఓ బోగీ అద్దాలు కూడా పగిలిపోయాయి. పగిలిన రైలు కిటికీ అద్దాలు వందేభారత్ రైలు రైలా స్టేషన్ మీదుగా వెళ్లగానే ఒక్కసారిగా రైలుపై రాళ్లు పడటం.. బోగీల్లోని కిటికీ అద్దాలు పగులగొట్టడం హఠాత్తుగా జరిగింది. ఈ సమయంలో బోగీలో కూర్చున్న ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్టేషన్‌లో లోకో పైలట్ రైలును ఆపి విచారించగా ఒక అద్దం పగలడం కనిపించింది. ఈ ఘటనపై లోకో పైలట్ జీఆర్పీ, ఆర్పీఎఫ్‌లకు సమాచారం అందించారు. GRP, RPF బృందాలు విచారణ ప్రారంభించాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :