జై భీమ్ టీవీ - జాతియం / : ఐఐటీ మద్రాస్ లో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ఓ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. అతని గదిలో తేదీ లేని, సంతకం చేయని ఓ నోట్ ను గుర్తించారు. తనతో మంచిగా మెలిగినందుకు గాను ఆ లేఖలో తోటి విద్యార్థులకు అతను థ్యాంక్స్ తెలిపాడు. విద్యార్థి గది నుండి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మృతి చెందిన విద్యార్థి కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. నిన్న సాయంత్రం సదరు విద్యార్థి ఎంత సేపటికీ తన గది తలుపు తీయకపోవడంతో తోటి విద్యార్థులు ఏదో జరిగిందని అనుమానంతో వార్డెన్ కు సమాచారం అందించారు. వారు కొత్తూర్ పురం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి, తలుపులు తెరిచి చూడగా చనిపోయిన స్థితిలో ఆ విద్యార్థి కనిపించాడు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నారు.
Admin