Sunday, 08 September 2024 06:42:06 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

అందుకే రాహుల్ గాంధీ యాత్రకు ప్రియాంక దూరం..

కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Date : 05 November 2022 02:38 PM Views : 343

జై భీమ్ టీవీ - జాతియం / : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనకపోవడంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అందుకే రాహుల్ గాంధీ యాత్రకు ప్రియాంక దూరం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలురాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో 10వ రోజు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా చౌటకుర్ మండలం సుల్లాన్ పూర్ నుంచి రాహుల్ శనివారం ఉదయం తన యాత్రను ప్రారంభించారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న రాహుల్.. యాత్రపైనే ఫోకస్ పెట్టారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో యాత్ర చేస్తున్న సమయంలో సోనియా గాంధీ అందులో పాల్గొన్నారు. అయితే ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనలేదు. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అక్కడ హోరాహోరీ పోరు నెలకొంటోంది.ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ప్రియాంక గాంధీని టార్గెట్ చేశారు. రాహుల్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధి వాద్రాల మధ్య గ్యాప్ వచ్చిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. అందుకే ఆమెను భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని రాహుల్ గాంధీ ఆహ్వానించలేదని చెప్పుకొచ్చారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారితో కలిసి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారంటూ అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఏంటో దీని ద్వారా తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కామెంట్స్.. శుక్రవారంనాడు హిమాచల్ ప్రదేశ్‌‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక గాంధీ.. బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలు మార్పులు కోరుకుంటున్నారని.. అందుకే బీజేపీ రెబల్స్‌ను మచ్చిక చేసుకునేందుకు విఫలయత్నం చేస్తోందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకొస్తామని చెప్పారు.హిమాచల్ ప్రదేశ్‌లో ప్రియాంక ఎన్నికల ప్రచారం.. హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. గుజరాత్ అసెంబ్లీతో పాటుగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గుజరాత్ అసెంబ్లీకి రెండు విడతల్లో డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :