Sunday, 08 September 2024 06:39:41 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

రాజీవ్ గాంధీ వ్యతిరేకించలేదా..? రాహుల్ గాంధీ ‘కుల గణన’ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..

Date : 10 October 2023 09:41 AM Views : 102

జై భీమ్ టీవీ - జాతియం / : Caste Census Politics: జాతీయ రాజకీయాల్లో కుల గణన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణన సర్వేను బహిర్గతం చేసినప్పటి నుంచి.. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ కాంగ్రెస్‌తోపాటు.. పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, తాజాగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో కులగణన చేపట్టాలంటూ తీర్మానం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గ‌ణ‌న చేప‌ట్టేందుకు చర్యలు చేప‌డ‌తార‌ని వెల్లడించారు. కుల గ‌ణ‌న‌కు అనుకూలంగా కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందంటూ పేర్కొన్నారు. ముందుగా కుల గ‌ణ‌న‌పై విస్తృతంగా చ‌ర్చించామ‌ని, ప్రతిఒక్కరూ మ‌ద్దతిచ్చార‌ంటూ వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్ సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతకుముందు కుల గణను ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలంటూ రాహుల్ గాంధీకి ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ధర్మేంద్ర ప్రధాన్.. కాంగ్రెస్, రాహుల్ గాంధీకి ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు. ఇవాళ కుల గణన ముసుగులో సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్ర్యం నాటి నుంచి యుపిఎ-2 ప్రభుత్వం వరకు కాంగ్రెస్ కుల గణనను తీవ్రంగా వ్యతిరేకించింది.. కాంగ్రెస్ దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పుడు కుల గణన ఎందుకు నిర్వహించలేదో ముందుగా చెప్పాలంటూ రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. కుల గణన నిర్వహించే రాజ్యాంగ హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రాహుల్ గాంధీ.. కుల గణనపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. మండల్ కమీషన్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వారికి 27% రిజర్వేషన్లు కల్పించడాన్ని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా? ఆ రాజకీయ పాపాన్ని కప్పిపుచ్చుకునే వికృత ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ నాటకాలు ఆడుతున్నారంటూ ధర్మంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :