Sunday, 08 September 2024 06:49:47 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ప్రొఫెసర్ స్వామినాథన్.. వ్యవసాయరంగ మేరునగం: ప్రధాని నరేంద్ర మోదీ

Date : 07 October 2023 02:53 PM Views : 91

జై భీమ్ టీవీ - జాతియం / : PM Narendra Modi-Swaminathan: ఇటీవలే.. అంటే కొన్ని రోజుల కిందట ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ మనకు దూరమయ్యారు. వ్యవసాయ శాస్త్రాన్ని విప్లవాత్మక మలుపు తిప్పిన ఓ దార్శనికుడిని మన దేశం కోల్పోయింది. భారతదేశానికి ఆ దిగ్గజం చేసిన సేవలు చరిత్రలో సువర్ణాక్షర లిఖితం. మాతృభూమిని అమితంగా ప్రేమించే ప్రొఫెసర్‌ స్వామినాథన్‌- మన దేశం సదా సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా.. PM Modi: ప్రొఫెసర్ స్వామినాథన్.. వ్యవసాయరంగ మేరునగం: ప్రధాని నరేంద్ర మోదీ PM Narendra Modi-Swaminathan: ఇటీవలే.. అంటే కొన్ని రోజుల కిందట ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ మనకు దూరమయ్యారు. వ్యవసాయ శాస్త్రాన్ని విప్లవాత్మక మలుపు తిప్పిన ఓ దార్శనికుడిని మన దేశం కోల్పోయింది. భారతదేశానికి ఆ దిగ్గజం చేసిన సేవలు చరిత్రలో సువర్ణాక్షర లిఖితం. మాతృభూమిని అమితంగా ప్రేమించే ప్రొఫెసర్‌ స్వామినాథన్‌- మన దేశం సదా సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా మన రైతులోకం సౌభాగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఒక తెలివైన విద్యార్థిగా తన ఉజ్వల భవిష్యత్తుకు బాటవేసుకునే వీలున్నా 1943 నాటి బెంగాల్‌ కరువు ఆయనను చలింపజేసింది. ఆ రోజుల్లో ఎంతగా ప్రభావితులయ్యారంటే- ఆరునూరైనా వ్యవసాయ రంగమే తన భవిష్యత్తుగా ఆయన తిరుగులేని నిర్ణయం తీసుకున్నారు. అటుపైన వ్యవసాయ శాస్త్రంలో చదువు ముగించిన స్వామినాథన్‌కు తొలినాళ్లలోనే ప్రపంచ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ నార్మన్‌ బోర్లాగ్‌తో పరిచయం ఏర్పడింది. నాటినుంచీ పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 1950లోనే అమెరికాలో అధ్యాపకుడుగా ఆయనకు అవకాశం వచ్చింది. కానీ, మాతృభూమి సంక్షేమం కోసం తన జన్మభూమి సేవలో తరించడమే తన ధ్యేయమంటూ దాన్ని తిరస్కరించారు. పెనుసవాళ్లతో నిండిన అప్పటి పరిస్థితుల్లో మేరునగంలా నిలిచిన స్వామినాథన్‌.. మన దేశాన్ని ఆత్మవిశ్వాసంతో స్వావలంబన వైపు నడిపించడాన్ని ఒకసారి ఊహించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి రెండు దశాబ్దాల్లో మనకు ఎదురైన పెను సవాళ్లలో ఆహార కొరత ప్రధానమైనది. ఆ మేరకు 1960వ దశకం తొలినాళ్లలో భారతదేశం కరువుకాటకాలు కమ్ముకుని అల్లాడుతోంది. అటువంటి గడ్డు పరిస్థితుల నడుమ ప్రొఫెసర్‌ స్వామినాథన్ మొక్కవోని పట్టుదల, నిబద్ధత, ముందుచూపుతో ఉజ్వల వ్యవసాయ శకానికి నాంది పలికారు. తదనుగుణంగా వ్యవసాయం రంగంలో.. ముఖ్యంగా గోధుమ సాగువంటి నిర్దిష్ట ఆహార పంటల సమృద్ధి దిశగా మార్గదర్శకుడై నిలిచారు. తద్వారా తొలుత గోధుమ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వృద్ధి సాధించగలిగింది. ఫలితంగా ఆహార కొరతతో అల్లాడిన భారత్‌ అప్పటినుంచీ స్వయం సమృద్ధ దేశంగా రూపొందింది. వ్యవసాయ రంగంలో దేశం సాధించిన ఈ అద్భుత విజయమే ఆయనకు “భారత హరిత విప్లవ పితామహుడు” అనే బిరుదును ఆర్జించిపెట్టింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :