Sunday, 08 September 2024 06:39:56 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

40 ఏళ్ల తర్వాత తమిళనాడు శ్రీలంక మధ్య సముద్రయానం మొదలు.. ఫెర్రీ సర్వీసు ప్రారంభం.. మూడు గంటల్లోనే కనకేసంతురాయ్‌ పోర్టుకు

Date : 15 October 2023 08:39 AM Views : 100

జై భీమ్ టీవీ - జాతియం / : భారతదేశంలోని నాగపట్నం, శ్రీలంకలోని కంకేసంతురై మధ్య ఫెర్రీ సర్వీసులను కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. మాట్లాడుతూ.. భారతదేశం, శ్రీలంక “దౌత్య, ఆర్థిక సంబంధాల కొత్త అధ్యాయం” వైపు పయనిస్తున్నాయని అన్నారు. 40 ఏళ్ల తర్వాత తమిళనాడు.. శ్రీలంక మధ్య సముద్రయానం మళ్లీ మొదలైంది. ఇంతకీ ఫెర్రీ సర్వీసు ప్రయాణం . ఏమిటంటే.. తమిళనాడు నుంచి ఉత్తర శ్రీలంకకు మధ్య సముద్ర ప్రయాణ సేవలు 40 ఏళ్ల తర్వాత మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఇరుదేశాల మధ్య ప్రయాణాన్ని తేలిక చేస్తూ.. నాగపట్నం నుంచి కనకేసంతురాయ్‌ పోర్టు వరకు ప్రయాణికులను తీసుకెళ్లడానికి సముద్రయాన సేవలను ప్రారంభించారు కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ మంత్రి సర్బానంద సోనోవాల్‌. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. తమిళనాడులోని నాగపట్నం, శ్రీలంకలోని కనకేసంతురాయ్‌ మధ్య ఈ ఫెర్రీ రాకపోకలు జరకానున్నాయి. చెన్నై నుంచి 325 కిలోమీటర్ల దూరంలో ఉండే తమిళనాడు నాగపట్నం నుంచి సముద్రం మీదుగా కేవలం మూడు గంటల్లోనే కనకేసంతురాయ్‌ పోర్టుకు చేరుకోనున్నారు ప్రయాణికులు. ఉత్తర శ్రీలంక రాజధాని జాఫ్నా నగరానికి సమీపంగా కనకేసంతురాయ్‌ వ్యూహాత్మక పోర్టు ఉంటుంది. మంచు దుప్పటి కప్పుకున్న ఔలిని తక్కువ ధరతో సందర్శించండి.. స్కీయింగ్ ఎంపిక ఇక.. ప్రయాణ టికెట్‌ ధర 7,670రూపాయలుగా అధికారులు నిర్ణయించారు. అయితే.. ప్రారంభం సందర్భంగా మాత్రం 2,800 రూపాయలు వసూలు చేశారు. ఈ సేవలను షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. ప్రయాణికులతోపాటు 40 కిలోల సామానును తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఫెర్రీ సర్వీసుల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఫెర్రీ సేవలతో తమిళనాడు-శ్రీలంక మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయన్నారు. రెండు దేశాల మధ్య వ్యాపార, పర్యాటక సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయని వివరించారు ప్రధాని మోడీ. కనెక్టివిటీ అంటే రెండు నగరాలను దగ్గరగా తీసుకురావడమే కాదు. ఇది ఇరుదేశాలను మరింత దగ్గర చేస్తుందని.. ప్రజలను , హృదయాలను మరింత దగ్గర చేస్తుంది” అని అన్నారు, రెండు దేశాల యువతకు వృద్ధికి కొత్త అవకాశాలను కల్పిస్తూ వారిని ప్రోత్సహించడంలో వాణిజ్యం, పర్యాటకం రంగంతో ముడిపడిన ప్రజల సంబంధాలు అతి ముఖ్యమైనవి అన్నారు. నాగపట్నం సమీప పట్టణాలతో ముడిపడి ఉన్న సముద్ర వాణిజ్యం గొప్ప చరిత్రను మోడీ గుర్తు చేసుకున్నారు. భారతదేశం… శ్రీలంకలను కలిపే వంతెనను సూచించే మహాకవి సుబ్రమణ్య భారతి ‘సింధు నదియిన్ మిసై’ పాటను కూడా ప్రస్తావించారు. ఫెర్రీ సర్వీస్, ఆ చారిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలన్నింటినీ మళ్లీ సజీవంగా తీసుకొచ్చిందని మోడీ అన్నారు. వాస్తవానికి.. సుమారు 40 సంవత్సరాల ముందు వరకు తమిళనాడు-శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులు నడిచేవి. కానీ.. ఎల్టీటీఈతో యుద్ధం వల్ల నిలిపివేశారు. అయితే.. ఎట్టకేలకు 40ఏళ్ల తర్వాత మళ్లీ పునఃప్రారంభం కావడంతో ఇరు దేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :