జై భీమ్ టీవీ - జాతియం / : సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరే గుడ్‌న్యూస్ అందించింది. వంట గ్యాస్ సిలిండర్‌పై మరో 100 రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద వంట గ్యాస్ తీసుకున్నవారికి ఈ సబ్సిడీ అందనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినేట్.. సిలిండర్ సబ్సిడీకి ఆమోదం తెలిపింది. సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరే గుడ్‌న్యూస్ అందించింది. వంట గ్యాస్ సిలిండర్‌పై మరో 100 రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద వంట గ్యాస్ తీసుకున్నవారికి ఈ సబ్సిడీ అందనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినేట్.. సిలిండర్ సబ్సిడీకి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు కేంద్రం 200 రూపాయల మేర సబ్సిడీని ప్రకటించింది. తాజాగా మరో 100 రూపాయల సబ్సిడీ ఇస్తుండడంతో మొత్తం రాయితీ 300 రూపాయలకు చేరింది. ఈ నిర్ణయంతో దేశంలోని లక్షల మంది ఉజ్వల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు.. ఇతర గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. తాజాగా 100 రూపాయల సబ్సిడీ కేవలం ఉజ్వల స్కీమ్ ద్వారా ఉచిత కనెక్షన్ పొందిన వారికి లభిస్తుంది. మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ అందిస్తోంది కేంద్ర సర్కార్. ఈ స్కీమ్ అమలు చేసేందుకు ఒక్కో కనెక్షన్‌పై కేంద్రానికి 2200 రూపాయల మేర ఖర్చవుతుంది. 2016, మే 1, యూపీలోని లక్షలాది కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ మొదలైంది. ఇటీవలే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్వల యోజన ద్వారా కొత్తగా మరో 75 లక్షల కనెక్షన్లు ఇస్తామని ప్రకటించింది. గ్రామాల్లోని, పట్టణ ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. కొత్తగా ఇచ్చే 75 లక్షల కనెక్షన్లతో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 10 కోట్లకు పైగా చేరుతుందని కేంద్రం వెల్లడించింది.
Admin