జై భీమ్ టీవీ - జాతియం / : ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరానికి మరి కొద్దిగంటలే మిగిలింది. సమవుజ్జీల సమరంవైపు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. వరుస విజయాలతో ఫైనల్స్‌లో దూసుకొచ్చిన టీమ్ ఇండియాపైనే ఇప్పుడు అందరి కళ్లున్నాయి.అయితే ఆసీస్‌తో అంత ఈజీకాదు. మనళ్లూ అంత ఈజీగా మ్యాచ్‌ని చేజారనివ్వరు. మరి ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. భారత్, ఆసీస్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర అన్ని రహదారులు వాహనాల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగల సీజన్, అందులోనూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కారణంగా నగరంలోకి భారీగా రద్దీ నెలకొంది. అంతేకాదు.. నగరంలో విమాన ఛార్జీలు, హోటల్ టారిఫ్‌లు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఢిల్లీ, ముంబై నుంచి అహ్మదాబాద్‌కి విమానంలో ప్రయాణించడానికి చివరి నిమిషంలో బుక్ చేసుకున్నప్పటికీ సాధారణంగా రూ. 8వేల నుంచి రూ. 10వేల వరకు ఖర్చు అవుతుంది. ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్స్ ప్రకారం.. నవంబర్ 18 నుంచి 20 మధ్య తేదీల్లో ఈ విమాన ఛార్జీలు 300శాతం పెంపుతో వరుసగా రూ. 31వేల నుంచి రూ. 43వేలు వరకు పెరిగాయి. ఇతర నగరాల నుంచి విమాన ఛార్జీలు కూడా సాధారణ రోజులతో పోలిస్తే.. కనీసం 150 నుంచి 200 శాతం పెరిగాయి. ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. 2011 తర్వాత వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కి వెళ్లడం, ప్రపంచకప్‌లో టోర్నీలో అన్ని మ్యాచులు గెలవడం.. ఇలా చాలా శుభశకునాలు కనిపిస్తున్నాయి. దీంతో కప్ గ్యారంటీ అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2003లో ప్రపంచకప్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా పరిస్థితి, ఇప్పటి పరిస్థితి పోల్చి చూసుకుంటే అప్పుడు ఆస్ట్రేలియా ఉన్న స్థితిలో ఇప్పుడు ఇండియా ఉన్నందున కచ్చితంగా కప్ మనదే అంటున్నారు. వీడియో చూడండి.. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజాప్రతినిధులు, సెలబ్రిటిలు.. ఫైనల్ మ్యాచ్ కు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Admin