Sunday, 08 September 2024 06:51:58 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

సుఖేష్‌ చంద్రశేఖర్ మరో సంచలనం..

కవితతో జరిపిన చాట్ ఇదే అంటూ స్క్రీన్ షాట్స్ విడుదల

Date : 12 April 2023 02:50 PM Views : 142

జై భీమ్ టీవీ - జాతియం / : సుఖేష్‌ చంద్రశేఖర్ మరో సారి సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచాడు. ఎమ్మెల్సీ కవితతో జరిపిన సంభాషణ అంటూ చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశాడు సుఖేష్‌ లాయర్‌. అక్కా అంటూ తెలుగులో జరిపిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వివరాలు.... MLC Kavitha: సుఖేష్‌ చంద్రశేఖర్ మరో సంచలనం.. కవితతో జరిపిన చాట్ ఇదే అంటూ స్క్రీన్ షాట్స్ విడుదలMLC Kavitha ఢిల్లీ మండోలి జైల్లో ఉన్న మాయగాడు ఈసారి చాటింగ్‌ బాంబ్‌ పేల్చాడు. ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సప్‌ చాట్‌ ఇదేనంటూ పలు స్క్రీన్ షాట్స్ విడుదల చేశాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌. తెలుగు రాని సుఖేశ్‌ అక్కడక్కడా తెలుగు పదాలతో చాట్‌ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కా అంటూ పలుమార్లు చాట్‌లో సంభోధించాడు సుఖేశ్‌. డబ్బు డెలివరీ చేశానంటూ వాట్సప్‌ చాట్‌లో పేర్కొన్నాడు సుఖేశ్‌. స్పోకెన్‌ టూ మనీష్‌ అని రిప్లై కూడా ఇచ్చాడు. గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ . కేజ్రీవాల్‌, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ ఆదేశాలపై హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ కారులో ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. అరుణ్‌ రామచంద్ర పిళ్లై ద్వారా డబ్బులు అందచేసినట్టు లేఖలో పేర్కొన్నారు. మనీలాండరింగ్‌ కేసులో మండోలి జైలులో ఉన్నాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌. రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సుఖేశ్‌ ఆప్‌ నేతలపై సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం కేజ్రీవాల్‌కు వందల కోట్ల ముట్టజెప్పినట్టు ఆరోపించాడు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :