Sunday, 08 September 2024 06:43:07 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

కాంగ్రెస్‌, టీఎంసీ నేతల ఇళ్లపై ఈడీ దాడులు.. ముఖ్యమంత్రి కుమారుడికి ఈడీ సమన్లు

Date : 27 October 2023 11:03 AM Views : 96

జై భీమ్ టీవీ - జాతియం / : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేతల నివాసాల్లో ఈడీ సోదాలు సంచలనం రేపాయి. ఫెమా ఉల్లంఘన కేసులో ఏకంగా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ తనయుడు వైభవ్‌కను విచారణకు హాజరు కావాలని ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సమన్లు జారీ చేసింది. అటు.. పశ్చిమ బెంగాల్‌లోనూ మంత్రి జ్యోతి ప్రియ ఇంట్లో ఈడీ రైడ్స్‌ చేయడం కలకలం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్‌ కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై ఈడీ దాడులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పేపర్‌ లీక్‌ కేసులో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. పేపర్‌ లీక్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్‌ నేతల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఈడీ దాడులు చేయిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈడీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈడీ దాడులపై మండిపడ్డారు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌. గతంలో కర్నాటక ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ నివాసంలో ఈడీ సోదాలు చేసిందని, అప్పుడు కాంగ్రెస్‌ గెలిచిందన్నారు గెహ్లాట్‌. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. రేషన్‌ స్కామ్‌లో 8 చోట్ల ఈడీ సోదాలు మరోవైపు.. రేషన్ పంపిణీలో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ నివాసంలోనూ ఈడీ దాడులు చేసింది. రేషన్‌ స్కామ్‌లో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఇక.. ప్రతిపక్షాలను దెబ్బతీయడం కోసమే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తన రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుంటోందని ఆరోపించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ దాడుల చేయిస్తూ.. బీజేపీ.. డర్టీ గేమ్‌ ఆడుతోందని మండిపడ్డారు దీదీ. అయితే.. మమతాబెనర్జీ వ్యాఖ్యలను ఖండించారు బెంగాల్‌ బీజేపీ చీప్‌ సుఖంతా మజుందార్‌. మొత్తంగా.. రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌లో ఈడీ రైడ్స్‌ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :