Sunday, 08 September 2024 07:01:16 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Date : 19 November 2023 09:00 AM Views : 106

జై భీమ్ టీవీ - జాతియం / : ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం (నవంబర్ 19) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,690 గా ఉంది. వెండి కిలో ధర రూ.500 మేర తగ్గి.. 76,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,790 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,550, 24 క్యారెట్లు రూ.61,690 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,000, 24 క్యారెట్ల ధర రూ.62,180, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,690 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690 గా ఉంది. వెండి ధరలు.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,000 గా ఉంది. ముంబైలో రూ.76,000 ఉండగా.. చెన్నైలో రూ.79,000, బెంగళూరులో రూ.72,250 ఉంది. కేరళలో రూ.79,000, కోల్‌కతాలో రూ.76,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,000, విజయవాడలో రూ.79,000, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,000 లుగా ఉంది. గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :