Sunday, 08 September 2024 06:53:38 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ప్రధాని మన్‌కీబాత్‌ సిరీస్‌లో మూడో పుస్తకం విడుదల.. ప్రముఖు రియాక్షన్‌..

Date : 20 October 2023 08:57 AM Views : 131

జై భీమ్ టీవీ - జాతియం / : దేశ ప్రజలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడేందుకు చేపట్టిన ‘మన్‌కీబాత్‌’ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశంలోని మారుమూల ప్రాంతాలతో పాటు, ప్రజలందరికీ తన మనస్సులోని మాటలను వివరించేందుకు ప్రధాని ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3న ప్రారంభించారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల చివరి ఆదివారం, ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రంమలో భాగంగా మోదీ పలు అంశాల గురించి దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేకతలను, ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను ప్రజలకు ప్రధాని వివరిస్తుంటారు. ఎంతో ప్రజాదారణ పొందిన ఈ కార్యక్రమం 100 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఇదిలా ఉంటే ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న మన్‌కీ బాత్‌ ను పుస్తక రూపంలో ప్రచురించిన విషయం తెలిసిందే. బ్లూక్రాఫ్ట్‌ డిజిటిల్‌ ఫౌండేషన్‌ ‘ఇంగ్నైటింగ్ కలెక్టివ్‌ గుడ్‌నెస్‌:ఎమ్‌కేబీ@100 పేరుతో పుస్తకం విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు సిరీస్‌ల పుస్తకాలు విడుదల చేయగా తాజాగా మూడో సీజన్‌ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సిరీస్‌లో మొదటి పుస్తకాన్ని 26 ఎపిసోడ్‌లు పూర్తి అయిన తర్వాత 2017లో విడుదల చేశారు. అనంతరం 50 ఎపిసోడ్‌లతో కూడిన తదుపరి పుస్తకాన్ని 2019లో మార్చిలో విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సిరీస్‌లో మూడవ పుస్తకాన్ని విడుదల చేసినందుకు ప్రచురణకర్తను అభినందిస్తూ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా అమిత్‌ షా ట్వీట్ చేస్తూ.. ‘ఈ కొత్త పుస్తకం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం చేపట్టిన అద్వితీయ ప్రయాణాన్ని చెబుతుంది. మోదీ గారు తన సంపూర్ణ శక్తితో, ఉమ్మడి లక్ష్యాల వెనక దేశాన్ని ఎలా సమీకరించారనే అంశాలను ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకాన్ని యువత కచ్చితంగా చదవాలి’ అని అమిత్‌ షా రాసుకొచ్చారు. ఇక ఈ పుస్తకం విషమై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డ మాట్లాడుతూ.. ‘మన్‌కీ బాత్‌, భారతీయులకు ఒక వేదికగా నిలిచింది. ఆధునిక ప్రజా ఉద్యమాన్ని వివరించే ఈ పుస్తకాన్ని ప్రతీ ఒక్కరూ చదవాలి’ అని నడ్డా చెప్పుకొచ్చారు. ఈ పుస్తకాన్ని అందుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ సైతం స్పందించారు. మన్‌కీ బాత్‌ కొత్త పుస్తకాన్ని స్వీకరించినట్లు తెలిపారు. ఇక కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ఈ పుస్తకాన్ని పొందినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :