Sunday, 08 September 2024 07:00:47 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఢిల్లీకి చేరిన కర్నాటక సీఎం పంచాయితీ.. సిద్దరామయ్యనా ! ..డీకే శివకుమారా..!

Date : 15 May 2023 12:52 AM Views : 173

జై భీమ్ టీవీ - జాతియం / : కర్నాటక సీఎం అభ్యర్థి ఎంపిక పంచాయితీ ఢిల్లీకి చేరింది. సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్, సిద్దరామయ్యలను మే 15న ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. రాహుల్, ఖర్గే చర్చించిన తరువాత కర్ణాటక సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మే 15 లేదా మే 16 తేదీల్లో సీఎం అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే సీఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్ఠానమే ప్రకటించాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బెంగుళూరులోని శాంగ్రీల్లా హోటల్ లో సీఎల్పీ భేటీ జరిగింది. ముఖాముఖీగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నియమించిన పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు తీసుకుని హైకమాండ్‌కు నివేదించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను పరిశీలకులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియమించారు. మొదట డీకే శివకుమార్.. సిద్దరామయ్యతో విడివిడిగా సమావేశమైన పరిశీలకులు తరువాత ఇద్దరితో కలిసి చర్చించారు. ఖర్గే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వేణుగోపాల్ సూచించారు. మీటింగ్ జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల కార్యకర్తలు బయట నినాదాలు చేశారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :