Sunday, 08 September 2024 06:39:08 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు.. సమాంతరంగా గొయ్యి తవ్వుతున్న సిబ్బంది

Date : 19 November 2023 08:58 AM Views : 114

జై భీమ్ టీవీ - జాతియం / : ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీలోని సిక్యారా టన్నెల్లో సహాయక చర్యలు నాలుగైదు రోజుల్లో మంచి ఫలితాలు ఇవ్వొచ్చని మాజీ PMO సలహాదారు ఖుల్బే చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం టన్నెల్లో కూలిన శబ్దం రావడంతో పనులు ఆపేశారు. ఈసారి టన్నెల్లో పైభాగం నుంచి తవ్వే ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపుఅటవీశాఖ నుంచి చెట్లు కత్తిరించే కట్టర్‌ తెప్పిచారు. టన్నెల్‌కు సమాంతరంగా గొయ్యిని తవ్వి , కార్మికులను రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ సాయాన్ని కూడా సహాయక చర్యలు కోసం తీసుకుంటున్నారు. ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి వరుసగా ఏడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాని కార్యాలయం అధికారులు కూడా సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 41 మంది కార్మికులు గత వారం రోజులుగా టన్నెల్‌ లోనే చిక్కుకున్నారు. అయితే టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులంతా క్షేమంగా ఉన్నారని ప్రాజెక్ట్‌ అధికారులు వెల్లించారు. డ్రిల్లింగ్‌ యంత్రంతో కూలిన శిథిలాల తొలచివేత ప్రక్రియ 24 మీటర్ల ముందుకు సాగింది. అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఆగర్‌ యంత్రం కూడా బాగా పనిచేస్తోందన్నారు అధికారులు. సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు మాజీ PMO సలహాదారు ఖుల్బే. “మేమందరం కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాం.. దేశప్రజలు కోరుకున్నట్టే జరుగుతుంది. 41 మంది కార్మికులను రక్షించడమే మా కర్తవ్యం. ఎక్కడ పొరపాటు జరగకుండా చూస్తున్నాం.. నేను రావడంతో బాధితుల కుటుంబాల్లో విశ్వాసం పెరిగింది .. ఇంకా చాలా రోజులు ఇక్కడే ఉంటా..” అని ఖుల్బే పేర్కొన్నారు. టన్నెల్‌ దగ్గర సహాయక చర్యలు మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఒక వేళ టన్నెల్‌ కూలితే కార్మికులు బయటకు రావడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ముందే ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :