Sunday, 08 September 2024 06:41:11 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

యువతకు గుడ్‌న్యూస్‌.. ఉచిత శిక్షణ ఇచ్చి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు

Date : 17 October 2023 11:15 AM Views : 97

జై భీమ్ టీవీ - జాతియం / : పేషెంట్‌ కేర్‌ (జీడీఏ), ఆసుపత్రి బిల్లింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కిమ్స్‌ ఫౌండేషన్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఎవరైనా సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రి ప్రాంగణంలో 4 నెలల పాటు శిక్షణ పొందవచ్చు. టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ సహకారంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసున్న యువతీ యువకులు ఎవరైనా దరఖాస్తుకు అర్హులన్నారు. మెడికల్‌ బిల్లింగ్, మెడికల్‌ టెర్మినాలజీ, స్పోకెన్‌ ఇంగ్లిష్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, కంప్యూటర్‌ టైపింగ్, ఎంఎస్‌ ఆఫీస్, పేషెంట్‌ కేర్, సాఫ్ట్‌స్కిల్స్‌ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు 80198 16641, 82472 55859 నంబర్లు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు లేదంటే సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులోని కిమ్స్‌ ఆసుపత్రిలో సంప్రదించాలని సూచించారు. ఓపెన్‌ పది, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్‌ పది, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అక్టోబ‌రు 16 నుంచి 26 వరకు జరగే ఈ పరీక్షలకు వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యిమందికిపైగా రాస్తున్నారు. పదో తరగతిలో 422 మంది, ఇంటర్‌ 597 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ అధికారి డి చలపతిరావు తెలిపారు. పరీక్షల తేదీలు, కేంద్రాలు, సమయం వంటి వాటి విషయాల్లో ఏవైనా సందేహాలు ఉంటే 8008403631 ఫోన్‌ నెంబర్‌ ద్వారా సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రారంభమైన ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభం అయ్యంది. చివరి విడత కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిపోయిన సీట్లతోపాటు తాజాగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో మంజూరైన సీట్లు అన్నింటినీ కలిపి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎంబీఏలో మొత్తం 5,053 సీట్లు, ఎంసీఏలో 2,153 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్ధులు ఈ సీట్లలో ప్రవేశాలు పొందవచ్చు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లలో చేరిన వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని ఐసెట్‌ కన్వినర్‌ స్పష్టం చేశారు. ఆ విషయాన్ని గమనించి ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని సూచించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :