Sunday, 08 September 2024 06:39:59 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బీఆర్ఎస్కు షాక్..ఢిల్లీలో పార్టీ ఫ్లెక్సీలు తొలగింపు

Date : 13 December 2022 12:24 PM Views : 213

జై భీమ్ టీవీ - జాతియం / న్యూ ఢిల్లీ : ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తొలగించారు. సర్దార్‌ పటేల్‌ రోడ్డులోని పార్టీ ఆఫీసు ఎదుట వెలిసిన ఫ్లెక్సీలను NDMC సిబ్బంది తీసేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఆఫీసు రోడ్డులో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే.. వీటికి అనుమతి లేకపోవడంతో ఫ్లెక్సీలను తొలగించినట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తెలిపారు. ఢిల్లీలో ఈ నెల 14న బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కేసీఆర్.. రాజ శ్యామల యాగాన్ని మొదలుపెట్టారు. 12 మంది రుత్వికులు ఢిల్లీలో రాజ శ్యామల యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. ఆపై పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూల మంత్ర జపాలతో రాజ శ్యామల యాగ నిర్వహణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మరోవైపు వారం రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించడంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కలిసొచ్చే పార్టీలతో కేసీఆర్ చర్చలు జరపనున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :