Sunday, 08 September 2024 06:57:36 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

అందరికీ అందుబాటు ధరలో వందే భారత్‌ .. త్వరలోనే పట్టాలెక్కనున్న..

Date : 13 October 2023 12:48 PM Views : 97

జై భీమ్ టీవీ - జాతియం / : భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేసింది వందే భారత్‌ రైలు. అధునాతన సదుపాయాలతో కూడిన వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వే చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనంగా చెప్పొచ్చు. అత్యంత వేగంతో దూసుకెళ్లడమే కాకుండా విమానంలో ఉన్న సదుపాయాలు ఈ రైళ్ల ద్వారా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి కూడా భారీగా ఆదరణ లభిస్తోంది. దేశంలో దాదాపు అన్ని ప్రధాన మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే అన్ని బాగున్నా ధర విషయంలో మాత్రం వందే భారత్‌ అందరినీ ఆకర్షించలేకపోతోంది. వందే భారత్ రైళ్లు సామాన్యులకు అందుబాటులో లేవనే చెప్పాలి. అందుకే సామాన్యులకు సైతం వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుంది. వందేభారత్‌ వేగంతో ప్రయాణించే నాన్‌ ఏసీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వందే సాధారణ్‌ లేదా నాన్ ఏసీ పుష్ పుల్ ట్రైన్‌ పేరుతో పిలిచే ఈ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్వయంగా తెలిపారు. ఈ రైలు ప్రత్యేకతలను ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేశారు. ఈ నెలాఖరులోగా ట్రాయల్‌ రన్‌ నిర్వహించి, ఈ ఏడాది చివరి నాటికి ఈ రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని సిద్ధం చేస్తున్నారు. ఈ రైళ్లలో 12 స్పీపర్‌ కాస్‌ కోచ్‌లు, 8 జనరల్‌ కోచ్‌లు, 2 గార్డు కోచ్‌లు ఉండనున్నాయి. చిత్తరంజన్‌ లోకోమోటివ్ ఫ్యాక్టరీలో వందే సాధారణ్‌ రైళ్ల కోసం ప్రత్యేకంగా రెండు ఇంజన్‌లను తయారు చేస్తున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్.. ఇదిలా ఉంటే రైల్వే శాఖ వందే మెట్రో, వందే స్లీపర్‌ రైల్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వందేభారత్‌, వందే మెట్రో స్లీపర్‌ వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్‌ రైలు ఎలా ఉండనుందో తెలిపే ఓ ఫొటోను పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలోపు ఈ రైలు తయారు పూర్తవుతందని సమాచారం. అనంతరం వందే మెట్రోకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నారు. మొత్తం మీద వీటన్నింటి రాకతో భారతీయ రైల్వే కొత్త రూపం సంతరించుకోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :