Sunday, 08 September 2024 06:59:45 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

Date : 07 November 2022 10:21 AM Views : 252

జై భీమ్ టీవీ - జాతియం / : ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు.. విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యు.యు.లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్​ దినేశ్​ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఆరున్నర రోజల పాటు సాగిన సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు.. విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై సుప్రీంకోర్టులో 40 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనని కొందరు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న నియమాన్ని,క్రిమీలేయర్‌ విధానాన్ని అతిక్రమిస్తోందని వాదించారు. ఆ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మినహాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుబట్టారు. కాగా.. ఈ చట్టాన్ని 2019, ఫిబ్రవరి 1న కేంద్రం అమలులోకి తెచ్చింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :