Sunday, 08 September 2024 06:54:57 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఆ నియోజకవర్గంలో ఐదు దశాబ్దాలుగా స్థానికేతరులే ఎమ్మెల్యే.. ఇంతకీ అది ఎక్కడంటే

Date : 20 October 2023 08:45 AM Views : 92

జై భీమ్ టీవీ - జాతియం / : రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు టికెట్ల పంచాయతీ జోరుగా నడుస్తోంది. అసమ్మతి, అసంతృప్తి పేరుతో కొన్ని పార్టీలు అట్టుడుకుతున్నాయి. తన కంటే తనకు టికెట్ అంటూ రచ్చ రచ్చ నడుస్తోంది. కానీ ఆ నియోజకర్గంలో పరిస్థితులు మాత్రం పూర్తిగా రివర్స్. ఒక్క కాంగ్రెస్ మినహా మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా స్థానికేతరులే. అంతెందుకు ఐదు దశాబ్దాలుగా అక్కడ స్థానికేతరులదే రాజ్యం. ఏంటి ఆ నియోజకవర్గం.. ఎవరక్కడ ఎమ్మెల్యేలో తెలుసుకుందాం. అచ్చంపేట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 1967లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గా ప్రకటించబడింది. నాటి నుంచి నేటి వరకు కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలే ఈ నియెజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎక్కువ శాతం స్థానికేతరులే కావడం విశేషం. వారే ఉమ్మడి రాష్ర్టంలో మంత్రులు సైతం అయ్యారు. ఒక్కసారి మినహా 5దశాబ్ధాలుగా ఇతర నియోజకవర్గాల వ్యక్తులదే అచ్చంపేటలో ఆధిపత్యం. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన స్థానికేతరులకు మంత్రులుగా సేవలందించే అవకాశం కల్పించింది ఆ నియెజకవర్గం. తెలంగాణ రాష్ర్టంలో మారుమూలన ఉన్న నల్లమల అడవుల కలిగిన అచ్చంపేట నియోజకవర్గం స్థానికేతరులనే అక్కున చేర్చుకుంది. సుమారు 56ఏళ్లలో ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి స్థానిక వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇప్పటి వరకు గెలిచిన వారి వివరాలు.. నాలుగు సార్లు(1967,1972,1983,1985) ఎమ్మెల్యేగా గెలిచిన మహేంద్రనాథ్ కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జొన్నలబోగుడ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇక మూడు పర్యాయాలు(1994,1999,2009) ఎన్నికైన పొతుగంటి రాములు సైతం కల్వకుర్తి నియోజకవర్గం గుండూరు స్వస్థలం. ఒక్కోమారు గెలిచిన ఆర్ ఎం మనోహర్(1978) స్వస్థలం హైదరబాద్ కాగా డి. కిరణ్ కుమార్ (1989) గోపాల్ పేట మండలం వాసి. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(2014,2018)ది వనపర్తి నియోజకవర్గం పొలికెపాడు గ్రామం. ఒక్క 2004 పర్యాయం మాత్రం డా, వంశీ కృష్ణ అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఎల్కపల్లి వాసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్థానికేతరులే ఎందుకు… కారణం ఏంటి.? ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 80శాతం ప్రజలు జీవనాధరం వ్యవసాయం. ఎలాంటి పరిశ్రమలు లేవు, అడవి విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతం. నల్లమలలో దట్టమైన అడవులు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంతో సరిహద్దు పంచుకుంటున్న కీలక నియోజకవర్గం అచ్చంపేట. ఇక అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు స్థానిక నేతలు పెద్దగా అసక్తి కనబరచడం లేదు. ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆ సామాజిక వర్గంలో అర్థికంగా బలమైన నాయకులు లేకపోవడం ఒక కారణంగా కనిపిస్తోంది. దీంతో పాటు రాజకీయాలపై ప్రజలకు సైతం అంత అంత మాత్రమే అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానికేతరులకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల పోటి.. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆరుసార్లు గెలిస్తే… టీడీపీ ఐదు సార్లు విజయం సాధించింది. ఇక గడిచిన రెండు పర్యాయాలు మాత్రం బీఆర్ఎస్ పాగా వేసింది. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా స్థానికేతరుడు గువ్వల బాలరాజు, కాంగ్రెస్ నుంచి స్థానికుడు వంశీకృష్ణ బరిలో నిలిచారు. ఈ దఫా అచ్చంపేట ఓటర్లు ఎవరికి పట్టం కడతారో, తీర్పు ఎలా ఉండబోతోంది వేచిచూడాల్సిందే.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :