Sunday, 08 September 2024 06:48:57 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూత

Date : 30 December 2022 08:29 AM Views : 204

జై భీమ్ టీవీ - జాతియం / : గుజరాత్​ : ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే హీరాబెన్ 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. తల్లి మరణంపై నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరారని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. అస్వస్థతకు గురైన హీరాబెన్​ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు యూఎన్ మెహతా ఆస్పత్రి వర్గాలు గురువారం రాత్రే ప్రకటించాయి. అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ బుధవారం ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి తన తల్లితో మాట్లాడారు. దాదాపు గంటన్నర సేపు ఆమె వద్దే ఉన్నారు. ఆ తర్వాత ఢీల్లికి వెళ్లారు. హీరాబెన్ ను ఒకటి, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపిస్తారని బీజేపీ నేతలు భావించారు. అయితే.. హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోడీని తీవ్ర విషాదంలో నెట్టింది. హీరాబెన్ మృతి పట్ల పలువురు బీజేపీ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మాతృమూర్తి మరణంతో ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ బయల్దేరారు. మరోవైపు ఈరోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ మోడీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. హీరాబెన్‌ మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ ఏడాది జూన్ లో హీరాబెన్ శత వసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమె ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. పోలింగ్ కు ముందు మోడీ తన తల్లిని కలిసి ఆమెతో కొంత సమయం గడిపారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :