Sunday, 08 September 2024 06:58:06 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బెంగళూరులో ఘోర ప్రమాదం.. బాణాసంచా గోడౌన్‌లో పేలుడు.. 13 మంది సజీవ దహనం

Date : 08 October 2023 09:10 AM Views : 102

జై భీమ్ టీవీ - జాతియం / : కర్ణాటక తమిళనాడు సరిహద్దులో శనివారం ఘోరప్రమాదం సంభవించింది. అత్తిపల్లిలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో ఇప్పటివరకు 13 మంది మృతిచెందారు. అదే విధంగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఈ అగ్ని ప్రమాదంలో కోటి రూపాయల విలువైన బాణాసంచాతో పాటు 1 క్యాంట్రో, 2 బొలెరోలు, 7 బైక్‌లు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంతో అత్తిపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.ఈ ఘటనపై బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లికార్జున బాలదండి తెలిపారు. ‘రామస్వామిరెడ్డికి చెందిన గోదాములో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో గోదాములో 20 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. బాణసంచా ప్రమాదంపై తదుపరి విచారణ జరుపుతామని వారు తెలిపారు. క్యాంటర్‌లో బాణాసంచా దించుతుండగా మంటలు చెలరేగడంతో మంటలు కొద్దిసేపటికే దుకాణం, గోదాములకు వ్యాపించాయి. పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఆపరేషన్‌ చేపట్టారు. ప్రస్తుతం 80 శాతం మంటలను అదుపు చేశామని పోలీసులు తెలిపారు. అనేకల్‌ తహసీల్దార్‌ శివప్ప లమాని స్పందిస్తూ.. గోడౌన్‌ రామస్వామిరెడ్డికి చెందినదని, గోడౌన్‌కు అనుమతి ఉందని తెలిపారు. అయితే అన్ని నిబంధనలు పాటించారా అనేది చూడాలి. మంటలు ఆర్పిన తర్వాత తనిఖీలు చేస్తామని చెప్పారు. కాగా ఈ ఘటనలో షాపు యజమాని నవీన్‌కు కూడా కాలిన గాయాలయ్యాయి.ప్రస్తుతం అగ్నిప్రమాదంపై ఖచ్చితమైన సమాచారం లేదు. FSL బృందం ధృవీకరణ తర్వాత మరిన్ని వివరాలు అందజేస్తామన్నారు. అదేవిధంగా షాపు లైసెన్స్‌ను పరిశీలిస్తున్నామని పోలీసులు, సంబంధిత అధికారులు తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :