Sunday, 08 September 2024 06:39:56 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

మనీశ్ సిసోడియాతో పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు : ఆప్ లీడర్లు

Date : 24 May 2023 07:24 AM Views : 161

జై భీమ్ టీవీ - జాతియం / : పోలీసులపై ఆమ్​ ఆద్మీ పార్టీ ఆరోపణ పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ డ్యూటీ చేశామని పోలీసుల వెల్లడి మీడియాతో మాట్లాడటం చట్టవిరుద్ధమని ప్రకటన న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్​లో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ లీడర్లు మండిపడ్డారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో మనీశ్ మెడపై చేయి వేసి పోలీసు అధికారి ఒకరు లాక్కెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఉదయం మనీశ్​ను పోలీసులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీపై విమర్శలు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. షాక్​కు గురయ్యాం: ఆప్ లీడర్లు మనీశ్ సిసోడియాను మెడపై చేయ్యేసి లాక్కెళ్తున్న వీడియోను ఆప్ లీడర్ ఆతిషి తన ట్విట్టర్​లో పోస్టు చేశారు. ‘‘రౌస్ ఎవెన్యూ కోర్టులో మనీశ్​తో పోలీసు అధికారి దారుణంగా ప్రవర్తించాడు. చూసి షాక్​కు గురయ్యాను. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి” అని అతిషి డిమాండ్ చేశారు. ‘‘మనీశ్‌‌‌‌జీతో ఇలా దురుసుగా ప్రవర్తించే అధికారం పోలీసులకు ఉందా? లేదంటే ఇలా చేయమని పోలీసులకు పైన ఉన్నోళ్లు ఎవరైనా ఆదేశిస్తున్నారా?’’ అంటూ కేంద్రంపై సీఎం కేజ్రీవాల్ పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తమ బాస్​ను సంతోషపెట్టేందుకే సిసోడియా మెడపై చేయి వేసి పోలీస్ ఆఫీసర్ లాక్కెళ్లాడు. దీనిపై కోర్టు స్పందించాలి. మోడీ జీ.. ఇండియా మొత్తం మీ నియంతృత్వ పాలన చూస్తున్నది” అని ఆప్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. ఆప్​ లీడర్ల ఆరోపణల్లో నిజం లేదు : పోలీస్ శాఖ ఆప్ లీడర్ల విమర్శలను ఢిల్లీ పోలీసు శాఖ ఖండిం చింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు మీడియాతో మాట్లాడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘రౌస్ ఎవెన్యూ కోర్టులో మనీశ్ సిసోడియాతో పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించలేదు. ఆప్ లీడర్ల ఆరోపణల్లో నిజం లేదు. మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే ఓ పోలీసు అధికారిగా మనీశ్​ను తీసుకెళ్లిపోయాడు. అతను డ్యూటీ మాత్రమే చేశాడు. వీడియోను సెక్యూరిటీ పరంగానే చూడాలి”అని పోలీసు శాఖ ట్వీట్ చేసింది. జూన్​ 1వరకు కస్టడీ పొడిగింపు లిక్కర్ స్కామ్ కేసులో వాదనలు విన్న ఢిల్లీ కోర్టు.. సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూన్ 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. చదువుకునేందుకు కొన్ని పుస్తకాలు కావాలని, ఒక టేబుల్, కుర్చీని కూడా ఏర్పాటు చేయాలని జడ్జిని మనీశ్ సిసోడియా కోరారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జడ్జి.. సిసోడియాకు అవసరమైన పుస్తకాలతో పాటు టేబుల్, కుర్చీ ఇవ్వాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించారు. అస్థిపంజరంలా మారిన సత్యేంద్ర జైన్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్​ను చూసి సీఎం కేజ్రీవాల్​తో పాటు ఆప్ లీడర్లు షాక్​కు గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్​ను ఈడీ అరెస్ట్​ చేసి తీహార్ జైల్లో ఉంచింది. వెన్నెముక సమస్య కారణంగా ఆయనను సోమవారం సఫ్దర్‌‌‌‌జంగ్ హాస్పిటల్​కు తీసుకొచ్చారు. కుర్చీపై కూర్చొని ఉండగా ఇద్దరు పోలీసులు ఆయనతో మాట్లాడుతున్న ఫొటో సోషల్​ మీడియాలో వైరల్ కావడంతో ఆప్ లీడర్లు స్పందించారు. ‘‘సత్యేంద్ర జైన్ అస్థిపంజరంలా మారిపోయారు. ఇప్పుడు బీజేపీకి సంతోషంగానే ఉంటది. ఆయన్ని చంపేద్దామనుకుంటున్నారా? ఆయన్ని అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. నడవలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు సెలెబ్రేషన్స్ చేసుకోండి” అంటూ బీజేపీపై ఆప్ లీడర్లు మండిపడ్డారు. అసలేం జరిగిందంటే..? లిక్కర్ స్కామ్ కేసు విచారణ తర్వాత కోర్టు రూం నుంచి మనీశ్​ను బయటకు తీసుకొస్తుండగా మీడియా చుట్టుముట్టింది. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్రం ఆర్డినెన్స్‌‌‌‌ తీసుకురావడంపై మీ అభిప్రాయం ఏంటని మీడియా ప్రశ్నించగా.. ‘‘మోడీ చాలా అహంకారిగా మారారు. ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు’’ అని సిసోడియా బదులిచ్చారు. వెంటనే పోలీసు అధికారి ఒకరు రిపోర్టర్లను పక్కకు నెడుతూ మనీశ్ సిసోడియా మెడ చుట్టూ చేయి వేసి అక్కడి నుంచి తీసుకెళ్లాడు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :