Sunday, 08 September 2024 06:42:31 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

మీ కళ్లతో చూసేది నిజం కాదు.. ప్రధాని మోడీ కూడా బాధితుడే.. ఇంతకీ ‘డీప్ ఫేక్’ అంటే ఏంటి?

Date : 18 November 2023 08:20 AM Views : 101

జై భీమ్ టీవీ - జాతియం / : ‘డీప్ ఫేక్’.. ఈ పదం సినీ తారల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు.. సెలబ్రిటీలతో పాటు సామాన్యుల వరకు ప్రతి ఒక్కరినీ భయపెడుతున్న పదం. దీనిబారిన పడితే అంతే సంగతులు.. అది నిజం కాదన్న సంగతి తెలిసేలోగా అవాస్తవం దావాగ్నిలా ఇంటర్నెట్ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. పరువు, ప్రతిష్టలను ఆ దావాగ్నిలో దహించేస్తుంది. సాధారణంగా ఎవరైనా సరే చెప్పుడు మాటలు నమ్మొద్దు.. కళ్లతో చూస్తే తప్ప నిజం కాదు అని చెబుతుంటారు. కానీ ‘డీప్ ఫేక్’ టెక్నాలజీ మీ కళ్లను కూడా మోసగిస్తుంది. తాజాగా దీనిబారిన పడ్డ రష్మిక మందన్న వంటి సినీతారల ఉదంతాలతో ఇప్పుడిది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏకంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘డీప్ ఫేక్’ టెక్నాలజీ సమాజానికి పొంచి ఉన్న భారీ ముప్పుగా ఆయన సూత్రీకరించారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు అవగాహన కల్గించాలని కూడా ఆయన సూచించారు. దీన్నిబట్టే ఇదెంత ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చు. ‘డీప్ ఫేక్’కి మోదీ సైతం బాధితుడే ‘డీప్ ఫేక్’ యావత్ భారత సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పుల్లో ఒకటి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీపావళి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘దివాళీ మిలన్’ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘డీప్ ఫేక్’ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘డీప్ ఫేక్’ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫొటోలు, వీడియోలు సమాజంలో తీవ్ర అలజడికి కారణమవుతాయని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో ‘డీప్ ఫేక్’ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ ప్రపంచంలో శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఓ పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమాజంలో అసంతృప్తిని ఓ దావాగ్నిలా వ్యాప్తిచేయగల సామర్థ్యం ‘డీప్ ఫేక్’ ఫొటోలు, వీడియోలకు ఉందని అన్నారు. తాను గార్భా నృత్యం చేస్తున్నట్టుగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ‘డీప్ ఫేక్’ టెక్నాలజీ ఉపయోగించి ఈ వీడియో తయారుచేశారని ప్రధాని మోదీ తెలిపారు. ఇలాంటి ‘డీప్ ఫేక్’ వీడియోలు సమాజంలో వైల్డ్ ఫైర్ మాదిరిగా వ్యాప్తిచెంది తీవ్ర సంక్షోభానికి దారితీస్తాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మీ కళ్లతో చూసేది కూడా నిజం కాదు చాలా మంది “చెప్పుడు మాటలు నమ్మను.. కళ్లతో చూస్తే తప్ప” అంటుంటారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ‘డీప్ ఫేక్’ యుగంలో కళ్లతో చూసేవి కూడా నిజం కాదు అనుకోవాలి. అవును.. మన కళ్లను సైతం మోసం చేసే రీతిలో ‘డీప్ ఫేక్’ టెక్నాలజీ ఉంది. దీన్ని ఉపయోగించి తయారు చేసిన వీడియోలు అచ్చంగా అచ్చంగా అసలైన వీడియోలుగానే ఉంటాయి. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు మొర్రో అని ఆ వ్యక్తి మొత్తుకున్నా సరే ఎవరూ నమ్మలేనంతగా ఉంటాయి. ఫోరెన్సిక్ నిపుణులు తప్ప అది నిజం కాదని సాధారణ కళ్లు గుర్తించలేవు. ఇంతకీ ‘డీప్ ఫేక్’ అంటే ఏంటి? ‘డీప్ ఫేక్’ గురించి తెలుసుకునే ముందు మార్ఫింగ్ గురించి ఓసారి గుర్తుచేయాలి. ఫొటోల్లో మనుషుల ముఖాన్ని మార్చి మరొకరి ముఖాన్ని అక్కడ అతికించడాన్ని మార్ఫింగ్ అంటాం. ఫొటోషాప్ వంటి ఆధునాతన ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చిన కొత్తలోనే ఈ మార్ఫింగ్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. మార్ఫింగ్ ద్వారా సినీ తారలు, రాజకీయ ప్రముఖుల అశ్లీల చిత్రాలను తయారు చేసేవారు. చివరకు మార్ఫింగ్ అంటే ఏంటి అన్నది సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరికి ఇంటర్నెట్ ప్రపంచంలో లక్షలకొద్ది మార్ఫింగ్ ఫొటోలు పేరుకుపోయాయి. ‘డీప్ ఫేక్’ అనేది మార్ఫింగ్‌కి ఆధునిక రూపం. మార్ఫింగ్ ద్వారా కేవలం ఫొటోలను ఎడిట్ చేసి ముఖాలను మార్చగలం. కానీ ‘డీప్ ఫేక్’ టెక్నాలజీతో వీడియోల్లో మనుషుల రూపాలనే మార్చేయవచ్చు. తాజాగా రష్మిక మందన్న లిఫ్ట్ ఎక్కుతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో ఎంత కలకలం సృష్టించిందో తెలుసు. నిజానికి ఒరిజినల్ వీడియోలో ఉన్నది జారా పటేల్. ఈ తరహాలోనే కత్రినా కైఫ్, కాజల్ వీడియోలు కూడా తెరపైకి వచ్చాయి. పోర్న్ సైట్లలో అయితే సినీ తారలను పూర్తి నగ్నంగా మార్చిన అశ్లీల వీడియోలు కూడా కోకొల్లలు. ‘డీప్ ఫేక్’ టెక్నాలజీతో తయారుచేసే ఈ నకిలీ వీడియోల్లో ఆ వ్యక్తి హావభావాలు సైతం సహజంగా ఉంటాయి. అందుకే సామాన్యులకు అది టెక్నాలజీ సహాయంతో తయారుచేసిన వీడియో అని గుర్తుపట్టలేరు. దీని బారిన సినీతారలే కాదు.. అనేక రంగాల ప్రముఖులు, సెలబ్రిటీలు పడుతున్నారు. సామాన్యుల జీవితాల్లోనూ ఇది చొచ్చుకెళ్లి తీవ్ర పరిణామాలకు కారణమవుతోంది. భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ప్రమాదం ‘డీప్ ఫేక్’ టెక్నాలజితో ఉంది. సినిమాల కోసం ప్రమాదకరమైన ఫైటింగ్ సీన్లు, సాహసోపేతమైన ఫీట్లు చిత్రీకరించే సమయంలో హీరోకు బదులుగా డూప్‌లను పెట్టి, వారిపై ‘డీప్ ఫేక్’ టెక్నాలజీని ప్రయోగించి వీక్షకులను నమ్మించవచ్చు. ఇలాంటి ఒకట్రెండు ప్రయోజనాలు తప్ప ‘డీప్ ఫేక్’ టెక్నాలజీతో దుష్పరిణామాలు, దుర్వినియోగమే ఎక్కువ. దీని పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని, ఏది నిజమో – ఏది నకిలీయో గుర్తించగలిగే విజ్ఞతను ప్రదర్శించడం తప్ప మరో దారి లేదు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :