జై భీమ్ టీవీ - జాతియం / : తమిళనాడు-శ్రీలంక తీరాల మధ్య సముద్రంలో విస్తరించిన ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడంతో పాటు ఆ ప్రాంతంలో రెండు వైపులా గోడ నిర్మించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవి కేవలం పాలనాపరమైన అంశాలని తెలియజేస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. తమిళనాడు-శ్రీలంక తీరాల మధ్య సముద్రంలో విస్తరించిన ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడంతో పాటు ఆ ప్రాంతంలో రెండు వైపులా గోడ నిర్మించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవి కేవలం పాలనాపరమైన అంశాలని తెలియజేస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. హిందూ పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు, న్యాయవాది అశోక్ పాండే ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇప్పటికే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిల్ పెండింగ్‌లో ఉందని గుర్తుచేసిన ఆయన.. ఆ పిటిషన్‌తో దీన్ని కూడా జత చేయాలని కోరారు. తాజా పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. గోడ నిర్మించాలని కోర్టు ఎలా ఆదేశిస్తుందని పాలనాపరమైన వ్యవహారాన్ని తామెందుకు చూడాలని ప్రశ్నించింది. జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని దాఖలైన పిల్‌తో దీన్ని జత చేయాలని పిటిషనర్ కోరినప్పటికీ.. అందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది.
Admin