Sunday, 08 September 2024 06:54:26 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెడుతున్నారా! ఇలాంటి ప్రొఫైల్ ఉన్నవారితో జర జాగ్రత్త..

Date : 17 November 2023 12:05 AM Views : 124

జై భీమ్ టీవీ - జాతియం / : ఈ రోజుల్లో చాలామంది మ్యాట్రిమోనీ సంబంధాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. పెళ్లి సంబంధాల కోసం మాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ పెట్టడం తప్పులేదు. కానీ దాని తర్వాత చోటు చేసుకునే పరిణామాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్లోని మార్కెట్ పీఎస్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యారేజ్ ప్రపోజల్ కోసం మాట్రిమోనిలో బయోడేటా పెట్టిందో మహిళ. ప్రొఫైల్ చూసి శ్రీనాధ్ అలియాస్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటాను అని చాట్ చేసాడు. మూడు నాలుగు రోజుల తర్వాత ఫిజికల్ గా కలవాలని మహిళకు చెప్పాడు శ్రీనాధ్. అది కూడా మామూలుగా కాదు మీరు బంగారం వేసుకొని చీరలో ఫోటో దిగితే చూడాలి అని ప్రపోజల్ పెట్టాడు. సికింద్రాబాద్ వచ్చి లాడ్జి తీసుకొని సదరు మహిళను పిలిచాడు. లాడ్జికి వస్తే తానే ఫోటో తీస్తానని నమ్మించి మాటలు కలిపి యువతిని బంగారం, చీర తీసుకొని రమ్మని నమ్మించాడు.. ఆమె లాడ్జ్ కు చేరుకోగానే తాను తీసుకున్న రూమ్‌కి పిలిచి ఫ్రెష్ అవ్వమని చెప్పాడు. ఆమె వాష్ రమ్‌కు వెళ్లిన తర్వాత ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్ లో 27 తులాల బంగారం తీసుకొని పరారయ్యాడు శ్రీనాథ్. తాను మోసపోయానని గ్రహించిన సదరు బాధితురాలు పోలీసులకు శ్రీనాథ్ పై ఫిర్యాదు చేసింది.. అయితే పోలీసుల దర్యాప్తులో మరో విషయం బయటపడింది. ఇతని పేరు శ్రీనాధ్ కాదు మోహన్ రెడ్డి అని దర్యాప్తులో తేలింది. గతంలో కూడా ఇతని పై రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మాట్రిమోనిలో ప్రొఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈజీ మనీ కోసం ఈ విధమైన మోసాలకు తెరలేపాడు శ్రీనాథ్. నిందితుడి పై కల్వకుర్తి, కందుకూరు, మాదాపూర్, చైతన్యపురి, మియపూర్, గుంటూరు దిశ పోలీస్ స్టషన్‌లలో కేసులు ఉన్నాయి. ఇలాంటి వారిపట్ల అప్రమతంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. మాట్రిమోనీలో ప్రొఫైల్ పెడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెరిఫైడ్ మాట్రిమోనీ వెబ్‌సైట్‌లోనే రిజిస్టర్ చేసుకోవాలి మాట్రిమోనీ వెబ్‌సైట్‌ అప్డేట్స్ కోసం కొత్త ఈమెయిల్ ఐడి ని క్రియేట్ చేసుకోవాలి మ్యాచ్ గురించి ప్రోపర్ బ్యాక్ గ్రౌండ్ చెక్ జరగాలి మితిమీరిన చాటింగ్ చేస్తున్న వ్యక్తులకు దూరంగా ఉండండి గిఫ్ట్ కార్డ్స్ లేదా డబ్బు అడుగుతున్న వారిని బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి వీడియో చాట్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు వీడియో చాట్‌కు అంగీకరిస్తే మీరు ప్రమాదంలో పడినట్టే

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :