Wednesday, 15 January 2025 09:22:23 AM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం..

6 గంటల్లోనే తల్లిఒడికి బిడ్డ! అసలేం జరిగిందంటే

Date : 24 November 2024 05:13 PM Views : 110

జై భీమ్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైద‌రాబాద్ : హైద‌రాబాద్ నీలోఫ‌ర్‌ ఆస్పత్రిలో తరచూ చిన్నారులు అపహరణకు గురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఓ గుర్తు తెలియని మహిళ నెల రోజుల శిశువును అపహరించింది. దవాఖాన సిబ్బందిని చెప్పి శిశువును కిడ్నాప్ చేసింది. అయితే ఈ శిశువు క‌ర్నూల్‌లో ప్రత్యక్షమవడం విశేషం. శిశువు కిడ్నాపైన కేవ‌లం ఆరు గంట‌ల్లోనే పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్‌ దంపతులకు చెందిన నెలరోజుల పసికందు అనారోగ్యం బారిన పడటంతో అక్టోబర్‌ 29న హైదరాబాద్‌లోని నీలోఫర్‌ దవాఖానలో అడ్మిట్‌ చేశారు. అప్పటి నుంచి చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శిశువు కోలుకోవడంతో శనివారం ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం దవాఖాన పాత భవనంలోని ఆరోగ్యశ్రీ కౌంటర్‌ వద్ద రవాణా ఖర్చులు తీసుకుని ఫొటో దిగుతున్నారు. ఆ పక్కనే ఉన్న గుర్తుతెలియని మహిళ వచ్చి చిన్నారిని తనకు ఇచ్చి ఫొటో దిగాలని చిన్నారి తల్లిదండ్రులకు సూచించింది. చిన్నారి తల్లి హసీనాబేగం ఆమె మాటలు నమ్మి.. బిడ్డను ఆ మహిళకు ఇచ్చింది. ఫొటో దిగిన తర్వాత చూస్తే అక్కడ సదరు మహిళ కనిపించలేదు. పరుగు పరుగున దవాఖాన మొత్తం కలియతిరిగింది. అయినా బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళ కనిపించలేదు. దీంతో బావురుమంటూ తల్లి హసీనాబేగం నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీ సహాయంలో బిడ్డ ఆచూకీ కనుగొన్నారు. వికారాబాద్‌లోని పర్గిలో పసికందును కిడ్నాప్ చేసిన మహిళను, ఆమె సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద శిశువుతో పాటు మరో శిశువు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. అనంతరం అపహరణకు గురైన పసికందును బిడ్డ తల్లికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :