Saturday, 18 May 2024 01:59:55 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

బీ అలర్ట్.. ప్రభుత్వ స్కీంల పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. ఓటిపి లతో జాగ్రత్త..!

Date : 18 October 2023 11:00 AM Views : 74

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : మీ ఫోన్లో ఓటిపిలు వస్తున్నాయా.. జాగ్రత్త సుమా.. తొందరపడ్డారా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. నీకు ఇంటి స్థలం మంజూరు అయింది, లేదా నీవు ప్రభుత్వ పథకానికి అర్హుడివి అయ్యావు అంటూ.. నీ ఫోన్లకు ఓటిపిలు పంపుతున్నారా.. అలాగే ఎవరైనా మీకు ఫోన్ చేసి వచ్చిన ఓటీపీలు చెప్పమంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. జాగ్రత్తగా చదవండి.. ఆదమరిచారా అంతే సంగతులు.. తరువాత నెత్తి నోరు కొట్టుకున్న జరగాల్సిన నష్టం జరిగి తీరిపోతుంది.. ఓటిపిల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది సైబర్ మోసగాళ్ల చేతుల్లో చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే వారి మోసానికి అడ్డుకట్ట వెయవచ్చని అధికారులు అంటున్నారు. అసలు ఓటిపి చెప్పడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటి..? ఓటిపి చెప్పమని మనల్ని ఎందుకు అడుగుతారు.. ఒకవేళ నిజంగా ఓటీపీ చెప్పవలసి వస్తే ఎవరికి చెప్పాలి.. దానికి సంబంధించిన విధి విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి లబ్ధిదారుడికి నేరుగా పథకాలు వారి వద్దకే అందించేలా గ్రామ, వార్డు ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగులని ఆ వ్యవస్థని అడ్డుపెట్టుకుని కేటుగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు అలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. ఎవరైనా మీకు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మీకు ప్రభుత్వ పథకాలు మంజూరు అయ్యాయని, అలాగే మీకు ఇంటి స్థలం మంజూరైందని లేక అమ్మఒడి ఇతరత్ర పథకాలకు మీరు అర్హులయ్యారని చెప్పి, మీ ఫోన్ కి ఓటీపీ పంపించామని అది వారికి తెలుపమని అడుగుతున్నారా.. ? అయితే అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఎవ్వడ్రా అంకుల్..! రైల్లో ప్రయాణికుడి రియాక్షన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.. ఏ ఉద్యోగి కూడా ఫోన్లో లబ్ధిదారులను ఓటిపి చెప్పమని అడగరని, అలా ఎవరైనా అడిగితే వారికి ఫోన్లో ఓటీపీలు చెప్పవద్దని అంటున్నారు. ఒకవేళ మీరు ఏ ప్రభుత్వ పథకానికైనా అర్హులు అయితే నేరుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే మీ వద్దకు వచ్చి మీ ముందే ఓటిపి తీసుకుంటారని, అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే ఓటిపిలు చెప్పవద్దని స్పష్టం చేస్తున్నారు. అలా సైబర్ నెరగాళ్లకు ఓటిపిలు చెప్పడం ద్వారా మన బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి లక్షలాది రూపాయల నగదు కొల్లగొడుతున్నారనీ, ప్రజలు వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో సచివాలయ ఉద్యోగులమంటు, ప్రభుత్వ పథకాల పేరుతో లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ ఓటిపిలు తీసుకుని, వారి అకౌంట్లో నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన ఫిర్యాదులు అధికారులకు పెద్ద ఎత్తున వస్తున్నాయి . ఇలాంటి సైబర్ నేరగాళ్ల అగడాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో చేపట్టారు.. ప్రతి ఒక్క లబ్ధిదారుడిని సైబర్ నేరాల పట్ల చైతన్యం చేస్తూ, వారి వలలో చిక్కకుండా ఉండేందుకు వారికి అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :