Saturday, 18 May 2024 01:59:51 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Andhra Pradesh: అక్టోబ‌ర్ 11 నుంచి వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమం.. పక్కా ప్లాన్స్ చేస్తున్న వైసీపీ..

Date : 05 October 2023 09:39 PM Views : 87

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : Andhra Pradesh: ప్రజా ప్రతినిధులు ప్రజ‌ల్లోనే ఉండాలి.. వారి స‌మ‌స్యలు, ఇబ్బందులను తెలుసుకోవాలి. అప్పుడే ప్రజ‌ల‌కు మ‌న‌పై న‌మ్మకం వ‌స్తుంది అంటూ సీఎం జ‌గ‌న్ ప్రతిసారి చెబుతారు. పార్టీ నేత‌ల‌తో స‌మావేశంలోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ ఈ విష‌యాన్ని ప‌దేప‌దే ప్రస్తావిస్తూ ఉంటారు. అందుకే త‌మ పార్టీ నాయ‌కుల‌ను, కేడ‌ర్ మొత్తాన్ని సుమారు ఏడాదిన్నర‌ కాలంగా ప్రజ‌ల మ‌ధ్యే ఉండేలా కార్యక్రమాలు రూప‌క‌ల్పన చేసారు. Andhra Pradesh: అక్టోబ‌ర్ 11 నుంచి వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమం.. పక్కా ప్లాన్స్ చేస్తున్న వైసీపీ.. Andhra Pradesh: ప్రజా ప్రతినిధులు ప్రజ‌ల్లోనే ఉండాలి.. వారి స‌మ‌స్యలు, ఇబ్బందులను తెలుసుకోవాలి. అప్పుడే ప్రజ‌ల‌కు మ‌న‌పై న‌మ్మకం వ‌స్తుంది అంటూ సీఎం జ‌గ‌న్ ప్రతిసారి చెబుతారు. పార్టీ నేత‌ల‌తో స‌మావేశంలోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ ఈ విష‌యాన్ని ప‌దేప‌దే ప్రస్తావిస్తూ ఉంటారు. అందుకే త‌మ పార్టీ నాయ‌కుల‌ను, కేడ‌ర్ మొత్తాన్ని సుమారు ఏడాదిన్నర‌ కాలంగా ప్రజ‌ల మ‌ధ్యే ఉండేలా కార్యక్రమాలు రూప‌క‌ల్పన చేసారు. ఎవ‌రెవ‌రు జ‌నంలో తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ ప్రజల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది వంటి నివేదిక‌లతో ఎప్పటిక‌ప్పుడు అలెర్ట్ అవుతున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని స‌చివాల‌యాల్లో ప‌ర్యట‌న‌లు పూర్తి చేసేలా ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకెళ్లారు. ఈ కార్యక్రమం దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దీంతో మ‌రో రెండు కార్యక్రమాల ద్వారా ప్రజ‌ల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసారు. వీటిలో ఇప్పటికే జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్రమం ప్రారంభం అయింది. సీఎం జ‌గ‌న్ లాంఛ‌నంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 రోజుల పాటు అధికారులు, పార్టీ నేత‌లు స‌మ‌న్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికీ వెళ్లేలా ఈ కార్యక్రమం రూపక‌ల్పన చేసారు. దీనిద్వారా ప్రతి ఇంటిలో అంద‌రి ఆరోగ్య ప‌రిస్థితిపై రిపోర్టులు సిద్దం చేస్తున్నారు. అవ‌స‌రం ఉన్నవారికి వైద్య ప‌రీక్షలు, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండ‌గానే అక్టోబ‌ర్ 11 నుంచి వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమం ప్రారంభించేందుకు వైఎస్సార్ సీపీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి విధివిధానాలు కూడా దాదాపు సిద్దం చేసింది. వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమానికి విధివిధానాలు సిద్దం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ సింగిల్ గా పోటీ చేసి 175 స్థానాలు గెలుస్తామ‌ని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం జ‌గ‌న్ కూడా వై నాట్ 175 నినాదంతోనే ముందుకెళ్తున్నారు. అంతేకాదు ప్రజల్లోకి వెళ్లిన‌ప్పుడు కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించ‌డంతో పాటు మీ కుటుంబానికి మంచి జ‌రిగింద‌ని అనిపిస్తేనే నాకు ఓటేయండ‌ని ధీమాగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పార్టీల‌క‌తీతంగా ప్రజ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించామ‌ని చెప్పుకొస్తున్నారు. దీంతో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమం రూప‌క‌ల్పన చేసారు. అక్టోబ‌ర్ 11వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేత‌లు. రాష్ట్రానికి మ‌రోసారి ముఖ్యమంత్రిగా జ‌గ‌న్ ఎందుకు రావాల‌నే క్యాంపెయిన్ నిర్వహించున్నారు. దీనికి సంబంధించి నెల రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించాల‌ని నిర్ణయించారు. గ‌త నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జ‌రిగిన సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయం వంటి అన్ని అంశాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రించేలా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వార్డు స్థాయి నాయ‌కుల నుంచి రాష్ట్ర స్థాయి నాయ‌కుల వ‌ర‌కూ అంద‌రూ పాల్గొననున్నారు. అయితే కార్యక్రమం ఎలా నిర్వహించాలి, ఏయే అంశాల‌పై ప్రజ‌ల‌కు వివ‌రించాలి అనే దానిపై ముందుగానే రాష్ట్ర స్థాయి వ‌ర్క్ షాప్ నిర్వహించ‌నుంది వైఎస్సార్ సీపీ. ఇప్పటికే గడ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం, జ‌గ‌న‌న్న సుర‌క్ష, జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్రమాల‌తో ప్రజ‌ల్లోకి వెళ్లిన కేడ‌ర్.. వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ క్యాంపెయిన్ ద్వారా ప్రభుత్వం చేసిన సంక్షేమం, ఒక్కో కుటుంబానికి అందిన ల‌బ్ది వివ‌రాలు అందించ‌డంతో పాటు గ‌త ప్రభుత్వంలో ఎలాంటి ప‌థ‌కాలు అందాయ‌నే దానిపై కూడా ప్రజ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. ఇంత సంక్షేమం, అభివృద్ది అందించారు కాబ‌ట్టి మ‌రోసారి జ‌గ‌న్ ను సీఎం చేయండ‌ని ప్రజ‌ల‌కు వివ‌రించనున్నారు. త‌మ కుటుంబానికి మంచి జ‌రిగింద‌ని భావిస్తేనే ఓటు వేయండ‌ని కోర‌నున్నారు. ఇలా నెలరోజుల పాటు ఈ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు వైసీపీ కేడ‌ర్. ఎన్నిక‌ల‌కు ముందు నేత‌లు ఒక‌వైపు, కేడ‌ర్ మ‌రోవైపు ప్రజ‌ల్లోనే ఉండేలా ప్రణాళిక‌లు.. సార్వత్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గర‌ప‌డుతున్న కొద్దీ సీఎం జ‌గ‌న్ కూడా పార్టీపై ఫోక‌స్ బాగా పెంచారు. వ‌చ్చే ఆరు నెల‌లు ఎంతో కీల‌కం అని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇంచార్జిలకు దిశా నిర్దేశం చేశారు. పూర్తి స్థాయిలో ప్రజ‌ల్లోనే ఉండాల‌ని సూచించారు. అంతేకాదు త్వర‌లో సీఎం జ‌గ‌న్ కూడా జిల్లాల ప‌ర్యట‌న ప్రారంభించేలా ప్రణాళిక‌లు సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష, వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం, పార్టీ అంతా ప్రజ‌ల్లోనే ఉండేలా ముందుకెళ్తున్నారు. దీని ద్వారా ప్రజ‌ల్లో ప్రభుత్వంపై మ‌రింత విశ్వాసం పెరిగేలా చ‌ర్యలు తీసుకుంటున్నారు. నేత‌లంతా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్రభుత్వం కొన‌సాగిస్తూ ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనాల‌ని సూచించారు. కిందిస్థాయి కేడ‌ర్ కూడా జ‌గ‌నన్న ఆరోగ్య సుర‌క్ష, వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్యక్రమాల్లో పాల్గొనాల‌ని సూచించారు. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించేలా కేడ‌ర్ ను అన్ని ర‌కాలుగా స‌మాయ‌త్తం చేస్తూ వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందుకెళ్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :