Saturday, 18 May 2024 10:36:20 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మధ్య తేడాలు గమనించండి.. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం జగన్

Date : 11 November 2023 03:56 PM Views : 92

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికీ మధ్య తేడాలు గమనించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ కు దక్కుతుందని తెలిపారు. మైనారిటీస్‌ వెల్ఫేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మైనార్టీల అభ్యున్నతి కోసం అనేక మార్పులు తీసుకోచ్చామని పేర్కొన్నారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, శాసనమండి డిప్యూటీ చైర్మన్‌గా మహిళకు అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మైనార్టీలను పట్టించుకోలేదని.. 2019 నుంచి మైనార్టీల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని.. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ప్రభుత్వం గౌరవిస్తోందంటూ వివరించారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్‌ రిజర్వేషన్‌లు అమలు చేశారని.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని.. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇంత సంక్షేమం జరగలేదన్నారు. అన్ని రంగాల్లో మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. సాధికారతను మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపించామని తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తుచేసుకున్న సీఎం జగన్.. ఆయన జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నామని.. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం అంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని.. అన్ని వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యమని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :