Saturday, 18 May 2024 10:51:52 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీ రైలు ప్రమాదం.. హెల్ప్‌లైన్‌ నంబర్లు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Date : 30 October 2023 09:00 AM Views : 63

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్‌ దగ్గర రెండు రైళ్లు ఢీకొన్నాయి. రాయగాడ ప్యాసింజర్‌ను వెనుక నుంచి పలాస రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సిగ్నల్‌ కోసం ఆగిన ప్యాసింజర్‌ను పలాస ప్యాసింజర్‌ ఢీకొంది. పట్టాలు తప్పిన విశాఖ- రాయగడ ప్యాసింజర్‌ మూడు బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా, సుమారు 40 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో సుమారు 14 అంబులెన్స్‌లకు పైగా తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఘటన స్థలానికి చేరుకున్న మంత్రి బోత్స సత్యనారాయణ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పట్టాలు క్రాస్‌ చేస్తుండగా ఒక ట్రైన్‌ను మరో రైలు ఢీకొంది. విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం అవుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ‌, జిల్లా కలెక్టర్, ఎస్సీని సంఘటన స్థలానికి హుటాహుటిన పంపించింది. అయితే ఘటనకు సంబంధించి వివరాలన్న ఎప్పటికప్పుడు తనకు అందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ, విశాఖ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను అందిస్తున్నారు అధికారులు. 08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671లకు సహాయం, సమాచారం కోసం సంప్రదించవచ్చు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :