Saturday, 18 May 2024 10:51:44 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఒంగోలులో భూబకాసురులు.. బద్దలవుతున్న కుంభకోణం! మరో ముగ్గురు అరెస్ట్

Date : 17 October 2023 11:27 AM Views : 63

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూములను కబ్జా చేస్తున్న భూ కుంభకోణం కేసుల్లో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న నలుగురిని ఇప్పటికే అరెస్ట్‌ చేయగా తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేశారు. బాధితులు ఇంకా వస్తున్నందున కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారు ఏ పార్టీకి చెందిన వారైనా అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని ఇంకా గుర్తిస్తున్నామని, కొంతమంది పరారీలో ఉన్నారని ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామిరెడ్డి వివరించారు. సిట్‌ దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో నిందితులకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు సహకరించినట్టు తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూముల ఆక్రమణ.. ఒంగోలులో గత ఇరవై ఏళ్ళుగా భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతో భూదందా వ్యాపకంగా ఎంచుకున్న కొంతమంది ముఠాగా ఏర్పడి నకిలీ వీలునామాలు, దస్తావేజులతో ప్రభుత్వ భూములు, ప్రయివేటు ఆస్తులు కొల్లగొట్టేస్తున్నారు. ఇక్కడ భూములు కొనుగోలు చేసిన ఎన్నారైలు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులకు చెందిన విలువైన స్థలాలను నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారు. భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తాము అడిగినంత ఇవ్వాలని లేకుంటే కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. ఈ విధంగా గత 15 ఏళ్ళుగా ఈ భూదందాను అడ్డూఆపూ లేకుండా కొనసాగిస్తున్నారు. బాధితులు ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తే రాజకీయ పలుకుబడితో పోలీసులను మేనేజ్ చేయడం ఈ ముఠాకు వెన్నతో పెట్టిన విద్యంగా మారడంతో ఇన్నాళ్ళూ వీరి బాగోతం వెలుగులోకి రాలేదు. అంతే కాకుండా పోలీసులు కూడా ఈ వ్యవహారాలన్నీ సివిల్‌ కేసులు కావడంతో కోర్టులో చూసుకోవాలంటూ చెబుతుండటంతో బాధితులు ఏం చేయాలో అర్ధంకాక అక్రమార్కులతో రాజీ పడుతున్నారు. రాజీ పడలేని వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే తాజాగా తాను కొనుగోలు చేసిన స్థలం ఆక్రమణకు గురైందంటూ ఒక అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తీగ లాగడంతో ఇప్పుడు అక్రమాల డొంక కదిలింది. ఈ నకిలీ పత్రాల కుంభకోణం వెనుక బడా బాబులున్నట్లు వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కొందరు అధికారులతో పాటు డాక్యు మెంట్ రైటర్లు, సర్వేయర్లు కూడా ప్రధాన భూమిక పోషించినట్లు అనుమానిస్తున్నారు. వీరిపాత్రపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :