Saturday, 18 May 2024 09:22:38 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టూరిజం స్పాట్‌గా గుంటూరు.. శిల్పారామాన్ని ప్రారంభించిన మంత్రి రోజా.. స్టేజిపై స్టెప్పులు వేసి సందడి..

Date : 15 October 2023 08:31 AM Views : 72

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : గుంటూరు అట్టహాసంగా నిర్మించిన శిల్పారామాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. శిల్పారామం అందుబాటులోకి రావడంతో గుంటూరు మరింత పర్యాటక ప్రాంతంగా మారనుంది. శిల్పారామం అనగానే హస్తకళా వస్తువులు గుర్తుకొస్తాయి. చెవి పోగుల, దుస్తులు, గాజులు, హ్యాంగ్స్ బ్యాగ్స్, చెప్పులు ఇలా అనేక రకాల వస్తువులు ఒకే చోట కనిపించి మగువల మనసు దోచేస్తాయి. కళలకు కొలువు శిల్పారామం.. శిల్పారామం హ్యాండీ క్రాఫ్ట్ కు కేరాఫ్ అడ్రస్. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది హైదరాబాదే. పూర్తి గ్రామీణ వాతావరణంతో పల్లెటూరు అందాలన్నీ కేంద్రీకృతమై ఉండే టూరిజం స్పాట్. అందుకే.. భాగ్యనగరంలో ఎన్నో సంప్రదాయ పండుగలకు శిల్పారామం వేదికవుతోంది. కానీ.. ఇప్పుడు గుంటూరు కూడా ఆ పేరు సొంతం చేసుకుంటోంది. అలాంటి అద్భుత శిల్పారామం గుంటూరులోనూ ఏర్పాటైంది. గుంటూరులోని నిర్మించిన ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్‌ కల్చరల్ సొసైటీని పర్యాటకశాఖ మంత్రి రోజా ప్రారంభించారు. 2017లో కేంద్ర ప్రభుత్వం గుంటూరులో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించింది. చేనేత హస్త కళల విభాగం తీర్మానం చేసి నాలుగు కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించింది. ఈ నిధుల్లో కేంద్రం 1.58 కోట్లు మంజూరు చేయగా.. ఏపీ ప్రభుత్వం 2.98 కోట్లు కలిపి మొత్తం నాలుగున్నర కోట్లతో శిల్పారామం ఏర్పాటు అయింది. గుంటూరులో శిల్పారామం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు మంత్రి రోజా. నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల వ్యయంతో శిల్పారామం నిర్మించామని తెలిపారు. కుటుంబ సభ్యులతో హాయిగా వచ్చి సేదతీరి, బోటింగ్‌లో విహరించే అవకాశం ఉందన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :