జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : రాజమహేంద్రవరం స్టేషన్ దగ్గరలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 9 రైళ్లు పూర్తిగా.. రెండు పాక్షికంగా రద్దు చేశారు రైల్వే అధికారులు.రాజమహేంద్రవరం రైల్వేస్టేన్ దగ్గర గూడ్స్ పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ILTD ప్లైఓవర్ దగ్గర ఈ ఘటన జరిగింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి రైల్వేస్టేషన్‌లో కాకినాడ లింగంపల్లి స్పెషల్ ట్రైన్‌తో పాటు రాజమండ్రిలో పలు చోట్ల ట్రైన్‌లు ఆగిపోయాయి. తమిళనాడు నుండి కొల్‌కతాకు కార్ల లోడ్‌ను తీసుకెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విశాఖ, విజయవాడకు వెళ్లే ట్రైన్లకు అంతరాయం ఏర్పడింది. పట్టాల మధ్యలో బోల్తా పడిపోయిన బోగిని తీసేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. దీంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 9 రైళ్లు పూర్తిగా.. రెండు పాక్షికంగా రద్దయ్యాయి. రైళ్ల రద్దు విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది
Admin