Saturday, 18 May 2024 01:11:16 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

మద్యపాన నిషేధం అసాధ్యం.. పాత బ్రాండ్‌లు తిరిగి తెస్తాంః అచ్చెన్నాయుడు

Date : 19 November 2023 08:56 AM Views : 85

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం అసాధ్యం అంటున్నారు ఏపీ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాము అధికారంలోకి వస్తే పాత బ్రాండ్‌లు తిరిగి తెస్తామంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయడం ఎవరి వల్లా కాదంటున్నారు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వస్తే….చంద్రబాబు హయాంలో ఉన్న మద్యం బ్రాండ్స్ అన్నీ తిరిగి తీసుకొస్తామని, మద్యం ధ‌ర‌లు నియంత్రిస్తామని చెబుతున్నారు అచ్చెన్న. మద్యం వ్యాపారంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని అచ్చెన్న ఆరోపించారు. మ‌ద్యం తాగేవారి ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్నారన్నారు అచ్చెన్న. గత నాలుగున్నరేళ్లలో నాసిరకం మద్యం తాగి 35 వేల మంది చనిపోయారని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు హయాంలో మద్యంపై ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే వైసీపీ హయాంలో లక్షా పది వేల కోట్లు వచ్చిందన్నారు. మద్యం ధరలు పెంచేశారని, 60 రూపాయల క్వార్టర్‌ బాటిల్‌ను 200 చేశారంటూ విమర్శలు గుప్పించారు అచ్చెన్న. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు తాగకుండానే కిక్ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూపాయల్లో విధించే పన్నును శాతాల్లోకి మారుస్తున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు. ట్యాక్స్‌ను సవరించాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అన్ని మద్యం బ్రాండ్లపై ఒకే రకమైన భారం పడుతుంది. క్వార్టర్ సీసాపై రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ. 20 పెంచుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానంతో కొన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలు తగ్గుదల కనిపించింది. వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేయకపోవడం వల్ల వాటి ధరలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. ప్రస్తుతం వ్యాట్‌ వసూళ్లలో మార్పులు తీసుకురావడం వల్ల తరచూ విక్రయించే బ్రాండ్లపై కొంత భారం పడింది. క్వార్టర్ బాటిల్‌పై రూ. 10-40 వరకూ, హాఫ్ బాటిల్‌పై రూ. 10-50 వరకూ, ఫుల్ బాటిల్‌పై రూ. 10-90 వరకూ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మద్యం బాటిళ్లపై ఉన్న ఐఎంఎఫ్ఎల్ ఆధారంగా పన్నుల శాతాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఐఎంఎఫ్ఎల్ కనీస ధర రూ. 2,500 లోపు ఉంటే దానిపై 250శాతం, రూ. 2,500 దాటితే దానిపై 150శాతం పన్నులు విధించినట్లు తెలిపారు. ఇక బీరుపై 225%, వైన్‌పై 200%, విదేశీ మద్యంపై 75% ఎఆర్ఈటీ ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ బ్రాండ్ల పై ఉన్న ధరలను చాలా కాలంగా పెంచలేదని, వాటి రవాణా, ఇతర ఖర్చుల ఆధారంగా ప్రస్తుతం పెంచామని వివరించారు. మద్యపాన నిషేధం అసాధ్యం అనడమే కాకుండా పాత బ్రాండ్లు తిరిగి తెస్తామని అచ్చెన్న చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇవి పొలిటికల్‌గా ఎలా టర్న్‌ తీసుకుంటాయో వేచి చూడాలి..!

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :