Saturday, 18 May 2024 10:36:18 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఎస్సై తుది రాతపరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Date : 17 October 2023 11:26 AM Views : 68

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై తుది రాత పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో శనివారం (అక్టోబర్‌ 14) జరిగిన పేపర్‌ 1 (ఇంగ్లిష్‌), పేపర్‌-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది హాజరయ్యారు. దాదాపు 608 మంది అభ్యర్ధులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. రెండో రోజైన ఆదివారం (అక్టోబర్‌ 15) జరిగిన పేపర్‌ 3 అంటూ అరిథ్‌మెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్షకు 30,569 మంది హాజరుకాగా.. పేపర్‌ 4 జనరల్‌ స్టడీస్‌ పరీక్షకు 30, 560 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. దీంతో ఎస్సై ఉద్యోగాలకు నియామక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు ముగిసిన మురుసటి రోజే అంటే సోమవారం నాడే పేపర్‌ 3, 4 పరీక్షల ప్రశ్నపత్రాలతో పాటు ప్రిలిమినరీ ఆన్సర్‌ కీలను ఏపీ పోలీస్‌ నియామక మండలి (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసింది. ప్రిలిమినరీ ఆన్సర్‌ కీలో సమాధానాలపై అభ్యంతరాలను అక్టోబర్‌ 18వ తేదీ సాయంంత్రం 5 గంటలలోగా అభ్యంతరాలు లేవనెత్తాలని బోర్డు తెల్పింది. నిర్ణీత ఫార్మాట్‌లో మెయిల్‌ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలియజేయాలని బోర్డు సూచించింది. ప్రైమరీ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం తుది కీతో పాటు ఫలితాలు కూడా బోర్డు విడుదల చేయనుంది. కాగా మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఇటీవల శారీరక కొలతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలను కూడా ఇటీవల వెలువరించింది. పీఎంటీ, పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈనెల 14, 15 తేదీల్లో మెయిన్‌ రాత పరీక్షలు నిర్వహించింది. ఎస్సై మెయిన్స్‌ పరీక్షలు మొత్తం 4 పేపర్లకు నిర్వహించారు. రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో, రెండు పేపర్లు డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌ కీలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :