Saturday, 18 May 2024 10:28:11 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

వారాహి ఐదో విడ‌త యాత్ర‌పై ప‌వ‌న్ చ‌ర్చ‌లు.. రైతుల స‌మ‌స్య‌లపై పోరాడేందుకు సిద్ధమైన జనసేన చీఫ్

Date : 18 October 2023 10:57 AM Views : 87

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్నాళ్ల గ్యాప్ త‌ర్వాత మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు..హైద‌రాబాద్ నుంచి రోడ్డు మార్గాన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంగ‌ళ‌గిరి చేరుకున్నారు..కొంత‌కాలంగా ప‌వ‌న్ వైరల్ ఫీవ‌ర్ తో ఇబ్బంది ప‌డ్డారు…తిరిగి కోలుకోవ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ మంగ‌ళ‌గిరి వ‌చ్చారు..నాలుగో విడ‌త వారాహి యాత్ర ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో జ‌రిగిన స‌మ‌యంలోనే ప‌వ‌న్ కొంచెం ఇబ్బంది ప‌డ్డారు..మ‌చిలీప‌ట్నంలో పార్టీ నేత‌ల‌తో స‌మావేశంలో ఆయ‌న తీవ్ర న‌డుంనొప్పితో మ‌ధ్య‌లోనే వెళ్లిపోయి రెస్ట్ తీసుకున్నారు…ఆ త‌ర్వాత వైర‌ల్ ఫీవ‌ర్ తో హైద‌రాబాద్ వెళ్లి అక్క‌డే ట్రీట్ మెంట్ తీసుకున్నారు..హైద‌రాబాద్ నుంచి మంగ‌ళ‌గిరి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తో భేటీ అయ్యారు.. తాజా రాజ‌కీయ పరిస్థితులు,వారాహి విజ‌య‌యాత్ర ఐదో విడ‌త,జ‌న‌సేన‌-తెలుగుదేశం పార్టీల ఉమ్మ‌డి స‌మ‌న్వ‌య క‌మిటీలో చ‌ర్చించాల్సిన అంశాలతో పాటు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి ప‌లు సూచ‌న‌లు చేసారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. వారాహి ఐదో విడ‌త యాత్ర నిర్వ‌హ‌ణ‌పై సుదీర్ఘ చ‌ర్చ‌ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వారాహి విజ‌య‌యాత్ర ఇప్ప‌టివ‌ర‌కూ నాలుగు విడ‌త‌లు పూర్త‌యింది.మొద‌టి విడ‌త ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్రారంభించి ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ముగించారు..ఇక రెండో విడ‌త విజ‌య‌యాత్ర ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో ప్రారంభించి త‌ణుకు బ‌హిరంగ స‌భ‌తో ముగించారు..మూడో విడ‌త‌లో ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న కొన‌సాగింది..నాలుగో విడ‌త వారాహి విజ‌య‌యాత్ర ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన‌సాగింది..అవ‌నిగడ్డ‌,మ‌చిలీప‌ట్నం,పెడ‌న‌,కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌టించారు..మ‌చిలీప‌ట్నం మిన‌హా మిగిలిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ వారాహి బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు…ఎక్క‌డ బ‌హిరంగ స‌భ జ‌రిగినా స్థానిక అధికార పార్టీ నేత‌ల‌తో పాటు సీఎం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్…ఇక ఈసారి ఐదో విడత వారాహి విజ‌య‌యాత్ర ఎక్క‌డి నుంచి ప్రారంభించాల‌నే దానిపై నాదెండ్ల మ‌నోహ‌ర్ తో చ‌ర్చించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్…ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల దాడి పెంచారు..దీంతో ఈసారి వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్….సీఎం జ‌గ‌న్ టార్గెట్ గా ముందుకెళ్తార‌ని పార్టీ నేత‌లు చెప్పుకుంటున్నారు..అయితే ఉమ్మ‌డి కృష్ణా జిల్లా లేదా గుంటూరు జిల్లాలో ఈసారి వారాహి యాత్ర ఉండే చాన్స్ ఉంద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. రైతుల స‌మ‌స్యలపైనే దృష్టి.. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులుపైనా నాదెండ్ల‌తో ప‌వ‌న్ చ‌ర్చించారు..సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన‌ట్లు చ‌ర్చ‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది..రైతుల పక్షాన నిలవాలని,అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగాపెడుతున్న కేసుల‌పైనా ప‌వ‌న్ – నాదెండ్ల చ‌ర్చించారు..తెలుగుదేశం పార్టీతో స‌మ‌న్వ‌యం కోసం ఉమ్మ‌డి స‌మావేశం నిర్వ‌హ‌ణ‌,ఏయే అంశాల‌పై చ‌ర్చించాల‌నే దానిపైనా ప‌వ‌న్ ప‌లు సూచ‌న‌లు చేసారు.ఇప్ప‌టికే రెండు పార్టీలు క‌మిటీలు ఏర్పాటు చేసాయి…రాబోయే రోజుల్లో ఉమ్మ‌డిగా చేప‌ట్టాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై ఈ క‌మిటీల జేఏసీ నిర్న‌యం తీసుకోనుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :