జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో జరిగినట్లే జరిగే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మధ్య జరిగే సన్నివేశాలను ఈ సందర్భంగా మంత్రి కొట్టు గుర్తుచేశారు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడి ఏదైనా జరిగితే దానికి ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌లదే బాధ్యత అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని ఆరోపించారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో జరిగినట్లే జరిగే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మధ్య జరిగే సన్నివేశాలను ఈ సందర్భంగా మంత్రి కొట్టు గుర్తుచేశారు. చంద్రబాబును ఆయన కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం తనకు ఉందన్నారు. ఆనాడు కట్టుకున్న భర్త చంద్రబాబు తన కన్నతండ్రి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేసి.. ఆయన చావుకు కారణమైనా భువనేశ్వరి కనీసం స్పందించలేదన్నారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే లోకేష్, భువనేశ్వరి బాధ్యత వహించాలని హెచ్చరించారు.
Admin