Saturday, 18 May 2024 01:59:49 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధానితో ప్రత్యేక భేటీ..

Date : 27 December 2022 10:25 AM Views : 196

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్న సీఎం.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ వెళ్తారు. రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. జనపథ్‌ 1లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భేటీ కానున్నట్టు సమాచారం. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాలసిన నిధులు, పోలవరం, విభజన హామీల గురించి ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు శీతాకాలం కాబట్టి పోలవరం నిధులు విడుదల చేస్తే వర్షాకాలం వచ్చే నాటికి చాలా వరకు పనులు పూర్తి చేయవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. జీ20 సమావేశాల పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ – చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తరువాత ఇప్పుడు మరోసారి సీఎం జగన్ ప్రధానితో భేటీ కావటం కీలకంగా మారుతోంది. ఇప్పటికే పలు సార్లు నివేదించిన పోలవరం సవరించిన అంచనాలు ప్రధాన అజెండాగా ఉంది. మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన ప్రధానితో చేయించాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జీ20 సన్నాహక సదస్సులు ఏపీలో నిర్వహణపైనా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రతిపక్ష పార్టీల పొత్తు వ్యవహారం కొనసాగుతోంది. ప్రధానితో జనసేన అధినేత పవన్ విశాఖ లో భేటీ తరువాత టీడీపీతో సంబంధాలపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రధానితో సీఎం సమావేశంలో ఏపీలో తాజా రాజకీయాల పై చర్చకు వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా జగన్ వచ్చే ఎన్నికలకు తన ప్రణాళిలను అమలు చేయనున్నారు. దీంతో, ఈ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :