జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తెలుగు రాజకీయాల్లో కీలయ పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 29వ తేదీ శనివారం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటి అయ్యారు. ఈ మధ్య కాలంలో వీరిద్దరి భేటీ జరగటం ఇది మూడోసారి. ఓసారి బెజవాడలోని హోటల్ లో.. ఆ తర్వాత హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంట్లోనే సమావేశం జరిగింది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ వీళ్లిద్దరు సమావేశం కావటం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందా లేదా.. పొత్తు ఉంటే ఎన్ని సీట్లకు అనే అంశాలపై టీడీపీ, జనసేన పార్టీల్లో ఆసక్తికర డిస్కషన్ కు తెర తీసింది. ఎర్రగొండపాలెం ఘటనపై చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. నిన్న (ఏప్రిల్ 28) ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రజనీ కాంత్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతల రియాక్షన్ గురించి చర్చించారు. ఢిల్లీ టూర్ తరువాత పవన్ కళ్యాణ్ సైలంటయ్యారు. పవన్ ఢిల్లీ టూర్ టీడీపీ, బీజేపీలను ఒకతాటిపైకి తెచ్చే లక్ష్యంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన జరిగింది. రెండ్రోజులు హస్తినలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పలువురు బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బీజేపీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేశారు.జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేయాలని గతంలో జనసేనాని బీజేపీ పెద్దల దృష్టి తీసుకెళ్లారు. వైసీపీకి వ్యతిరేకంగా తాము బలంగా పోరాడతామని ప్రతిపక్షాలు సంకేతాలు వస్తున్నాయి. జేపీ నడ్డాతో భేటీ అయిన తరువాత పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ప్రకటించారు. కాని పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయం ఉంటుందని గతంలోనే పవన్ చెప్పారు. ఈ భేటి విషయంపై పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చించారా .. లేదా అన్న విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Admin