Saturday, 18 May 2024 01:42:04 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపిస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే

Date : 10 January 2023 01:02 PM Views : 201

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / ఏలూరు జిల్లా : వైసీపీ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీపైనే మళ్లీ విమర్శలు గుప్పించారు. తమ కుటుంబం 55ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు చాలా మారిపోయాయన్న కృష్ణ ప్రసాద్ అసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపిస్తోందని వాపోయారు. ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని ఒక్కోసారి అనిపిస్తుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం10 మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగితేనే నాయకుడిగా ముందుకు సాగే పరిస్థితి ఉందని కృష్ణ ప్రసాద్ అన్నారు. అది చేతకాకపోవడం వల్లే తాను పాతతరం నాయకుడిగా మిగిలిపోయానని చెప్పారు. మూడున్నరేళ్ల కాలంలో ఒక్కరిపై కూడా అక్రమ కేసులు పెట్టించలేదని, ఈ విషయంలో తనపై తమ పార్టీలోని కొందరు నేతలకు అసంతృప్తి ఉండొచ్చని అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి సాటి వ్యక్తులకు సాయం చేయలేకపోతున్నానని కృష్ణ ప్రసాద్ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని... వాటిని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణ ప్రసాద్ సూచించారు. గుంటూరులో ఇటీవల నిర్వహించిన టీడీపీ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై ఆయన స్పందిస్తూ సేవా కార్యక్రమాలను చేసే వారిని విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఎన్నారైలను ఆపడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి స్నేహితుడని, చాలా మంచి వ్యక్తి అని అలాంటి వాడిపై ఏవేవో చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తొక్కిసలాట ఘటనను చిలవలు, పలవలు చేసి చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :