Saturday, 27 July 2024 12:49:44 PM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

కులగణన వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం.. కారణం ఏంటో తెలుసా..?

Date : 25 November 2023 08:18 AM Views : 149

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన ప్రక్రియను వాయిదా వేసింది. నవంబర్ 27వ తేదీ నుంచి కులగణన సర్వే చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. డిజిటల్ విధానంలో మొత్తం డోర్ టు డోర్ సర్వే చేపట్టాలని ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. ఇప్పటికే కులగణన ఎలా చేపట్టాలి? ఇంటింటికీ వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలి వంటి అంశాలపై అధికారులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కోసం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది వినియోగించుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం. వాలంటీర్లు ఆధ్వర్యంలో కులగణన జరిగేలా అంతా సిద్ధం చేశారు. మరోవైపు కులసంఘాల, నిపుణులతో జిల్లావారీ గాను, ప్రాంతీయ సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూల్‌‌లో ప్రాంతీయ సమావేశాలు పూర్తయ్యాయి. తిరుపతిలో నవంబఱ్ నెల 28న ప్రాంతీయ సదస్సు జరగనుంది. మరోవైపు పైలెట్ ప్రాజెక్టుగా ఐదు సచివాలయాల పరిధిలో సర్వే కూడా విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు. అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత చివరి నిమిషంలో కులగణన ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రకటించారు. ఈ కారణాలతోనే వాయిదా వేశామని చెబుతున్న ప్రభుత్వం దేశంలో బీహార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాత్రమే కులగణన చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఆరుగురు అధికారుల కమిటీని నియమించింది. ఈ బృందం బీహార్ రాష్ట్రంలో పర్యటించి, అక్కడ కులగణన జరిగిన విధానంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిటీ నివేదిక ఆధారంగా కేబినెట్ కూడా కులగణన చేపట్టేందుకు ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయం తర్వాత ప్రక్రియను వేగవంతం చేసింది. కొన్ని కారణాలతో నవంబర్ 27 నుంచి ప్రారంభం కావాల్సిన కులగణన ప్రక్రియను డిసెంబర్ పదో తేదీకి వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు మంత్రి వేణుగోపాల కృష్ణ. పేదల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకే కులగణన అని, మెరుగ్గా ఈ ప్రక్రియను చేపట్టాలనే ఉద్దేశంతో వాయిదా వేశామన్నారు మంత్రి. ఇప్పటికే కులగణనపై జిల్లా స్థాయిలో, రీజినల్ స్థాయిలో కుల పెద్దలతో సమావేశాలు ముగిశాయి. కుల సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు మంత్రి వేణుగోపాల్. మండల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించి ఎక్కువ మంది అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ముందుకెళ్తాలనే కారణంతో వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెబుతుంది. కులగణనపై చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూడా మంత్రి వేణుగోపాల్ చెప్తున్నారు. వాస్తవంగా మొదట్లో అనుకున్న షెడ్యూల్ ప్రకారం నవంబర్ 27 నుంచి ప్రారంభించి వారం రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే, డిసెంబర్ 10 నుంచి ప్రారంభించి వారంలో ప్రక్రియ పూర్తి చేసేలా కొత్తగా షెడ్యూల్ ను రూపొందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :