Saturday, 18 May 2024 12:36:44 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఆ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచే విద్యుత్ సబ్సిడీ..

Date : 18 October 2023 10:55 AM Views : 92

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం కొంత‌కాలంగా అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. క‌రోనా స‌మ‌యంలో రొయ్య‌లు, చేప‌ల ప‌రిశ్ర‌మ అనేక న‌ష్టాల‌ను చ‌విచూసింది. అయితే రైతులు న‌ష్ట‌పోకుండా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు కూడా చేప‌ట్టింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌‌కు రొయ్య‌లు ఎగుమతి నిలిచిపోవ‌డంతో కంపెనీలు కొన‌డానికి ముందుకు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాంటి స‌మ‌యంలో రొయ్య‌ల కంపెనీల య‌జ‌మానుల‌తో ప్ర‌భుత్వం స‌మావేశం ఏర్పాటు చేసి రైతులు న‌ష్ట‌పోకుండా ధ‌ర‌ల‌ను నిర్ధారించింది. ఎంపెడా స‌హ‌కారంతో రాష్ట్ర మ‌త్స్య‌శాఖ రైతుల‌ను ఆదుకునేలా ముందుకు వెళ్లింది. ఆ త‌ర్వాత కూడా ఆక్వా రైతుల‌కు ఇబ్బంది లేకుండా ఉండేలా ప్ర‌త్యేకంగా ఓ క‌మిటీని కూడా నియ‌మించింది. ఆక్వా సాధికార క‌మిటీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ క‌మిటీలో మంత్రులు సిదిరి అప్ప‌ల‌రాజు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఆక్వా డెవ‌ల‌ప్‌మెంట్ అధారిటీ అప్స‌డా ఛైర్మ‌న్ వ‌డ్డి ర‌ఘురాం స‌భ్యులుగా ఉన్నారు. ఈ సాధికార‌త క‌మిటీ ఆక్వా ప‌రిశ్ర‌మ‌లో ఒడిదుడుకుల నివార‌ణ‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఆక్వా ఫీడ్, ఆక్వా సీడ్ రేట్ల నియంత్ర‌ణ‌ల‌కు క‌మిటీ చ‌ర్య‌లు తీసుకుంటుంది. వ‌చ్చే నెల నుంచి రొయ్య రైతుల‌కు విద్యుత్ స‌బ్సిడి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఆక్వా సాధికారిత కమిటీ ఆరో సమావేశం అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జ‌రిగింది. గతంలో ఆక్వా ఫీడ్, సీడ్ రేట్లను నియంత్రించే విధానం లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల ఒడిదుడుకులకు స్థానికంగా ఆక్వారంగం ఇబ్బందులను ఎదుర్కొంద‌ని అన్నారు. వీటిని క్రమబద్దీకరించేందుకు సాధికారిత కమిటీ ఎప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4 ల‌క్ష‌ల 65 వేల‌ ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో ఉందని క‌మిటీ గుర్తించింది. వీటిలో పది ఎకరాల లోపు 3.26 ల‌క్ష‌ల ఎక‌రాలు విద్యుత్ సబ్సిడీకి అర్హత ఉన్నట్లు గుర్తించింది ప్ర‌భుత్వం. అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ-ఫిష్ సర్వే నిర్వహించిన‌ట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. మొత్తం 46 వేల‌ 433 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు సబ్సిడీకి అర్హత ఉన్నట్లు గుర్తించామ‌న్నారు. మరో 4230 కనెక్షన్‌లకు కూడా రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత వారికి కూడా సబ్సిడీకి అర్హత ఉన్నట్లు నిర్ధారించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఈ కనెక్షన్‌లకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సబ్సిడీ విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్న‌ట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వం నిర్ణయించిన రేట్ల‌కే రొయ్యలు కొనుగోలు చేయాలి.. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ధ‌ర‌ల ఆధారంగా ఆక్వా సాధికార క‌మిటీ ఎప్ప‌టిక‌ప్పుడు రొయ్య‌ల ధ‌ర‌ల‌ను నిర్ధారిస్తుంది. రైతుల‌కు న‌ష్టం లేకుండా పెట్టుబ‌డి ఖ‌ర్చు పోను లాభం చేకూరేలా ధ‌ర‌ల‌ను నిర్ణయిస్తుంది. ఈ ధ‌ర‌ల ప్ర‌కార‌మే రొయ్య‌ల కంపెనీలు రైతుల నుంచి రొయ్య‌ల‌ను కొనుగోలు చేయాల‌ని క‌మిటీ ఆదేశిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వంద కౌంట్ రొయ్యలకు కేజీ 240గా రేటు ఖరారు చేసింది క‌మిటీ. ఇంతకన్నా తక్కువకు కొనుగోళ్ళు చేయడానికి వీలులేదు. అలాగే స్థానిక మార్కెట్‌లో ప్రతి నెలా వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. దీనిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ఆక్వాహబ్‌ల ద్వారా స్థానిక మార్కెట్‌లో వినియోగంను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :