జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విశాఖపట్నం లో సీఎం క్యాంప్ కార్యాలయం,ప్రభుత్వ శాఖల ఏర్పాటుపై ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తుంది.ఇప్పటికే గత మూడు రోజుల్లో రెండు కీలక జీవోలు జారీ చేసింది ప్రభుత్వం.జీవో ఎంఎస్ 2004,జీవో ఎంఎస్ 2015 ద్వారా విశాఖపట్నం లో ప్రభుత్వ శాఖల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చింది..ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి చేయడంలో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయం తో పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జీవోల్లో పేర్కొంది..మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి చేయడం,ముఖ్యమంత్రి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరువ కావడానికి విశాఖపట్నం కేంద్రంగా సమీక్షలు చేయాల్సి ఉంటుందని జీవో ఎంఎస్ 2004లో ప్రభుత్వం పేర్కొంది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆ జీవోలో పేర్కొంది.సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి తో పాటు అధికారులు కొన్ని రోజులపాటు అక్కడే ఉండాల్సి వస్తుందని,క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.జీవో ఎంఎస్ 2004 ఆధారంగా మరో జీవో 2015ను జారీ చేసింది..విశాఖపట్నంలో ప్రభుత్వ శాఖల కు అవసరమైన వసతి సదుపాయాలు కల్పించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో పాటు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.ప్రణాళికా శాఖ నోడల్ ఏజన్సీ గా వ్యవహరించనుంది…ప్రభుత్వం నియమించిన కమిటీ వెంటనే తన పని ప్రారంభించింది. ఏ శాఖకు ఎంత స్థలం కావాలో వివరాలు ఇవ్వాలని ఆదేశాలు.. విశాఖపట్నం లో ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు అవసరమైన వసతిని చూసే కమిటీ వెంటనే తన పని ప్రారంభించింది.ప్రభుత్వం లో ఉన్న అన్ని శాఖలకు సాదారణ పరిపాలన శాఖ నుంచి అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది…జీవో ఎంఎస్ 2004,జీవో ఎంఎస్ 2015 ల ఆధారంగా చూపిస్తూ సర్కులర్ జారీ చేసింది. దీని ప్రకారం అన్ని శాఖలు తమ శాఖ మంత్రికి అలాగే శాఖల ఏర్పాటుకు కావాల్సిన స్థలం వివరాలు కోరుతూ సర్కులర్ పంపించింది..ఈ సర్కులర్ లో రెండు ప్రతిపాదనలు కావాలని కోరింది.ముందుగా సంబంధిత శాఖకు చెందిన మంత్రి కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని లేదా స్థలాన్ని చూసారా..?ఒకవేళ చూస్తే ఏ ప్రాంతంలో చూసారు?ఎన్ని చదరపు గజాల విస్తీర్ణంలో ఎంపిక చేసారని వివరాలు అడిగింది కమిటీ..ఒకవేళ స్థలం ఎంపిక చేయనట్లైతే ఎన్ని చదరపు గజాల విస్తీర్ణం అవసరమో తెలపాలని స్పష్టం చేసింది..ఇక రెండో విభాగంలో సంబంధిత శాఖకు అవసరమైన కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన వివరాలు కోరింది.శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి,శాఖాధిపతులు ఉండేలా కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని లేదా స్థలాన్ని చూసారా..?ఒకవేళ చూస్తే ఏ ప్రాంతంలో చూసారు?ఎన్ని చదరపు గజాల విస్తీర్ణంలో ఎంపిక చేసారని వివరాలు అడిగింది కమిటీ..ఒకవేళ స్థలం ఎంపిక చేయనట్లైతే ఎన్ని చదరపు గజాల విస్తీర్ణం అవసరమో తెలపాలని పేర్కొంది… అక్టోబర్ 17వ తేదీలోగా అన్ని వివరాలు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ వివరాల ఆధారంగా విశాఖలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యాలయాలు ఏర్పాటుకు భవనాలు ఎంపిక చేయనుంది కమిటీ.
Admin